మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ ఈ నెల 31న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ ఈ నెల 31న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించిన గవర్నర్ విద్యాసాగర్ రావు బలనిరూపనకు 15 రోజులు గడువు ఇచ్చారు. ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు హాజరుకానున్నారు.
మహారాష్ట్ర బీజేపీ శాసనసభ పక్షనేతగా దేవేంద్ర ఫడ్నవిస్ ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాసన సభ నేత ఎంపిక కోసం ముంబైలో మంగళవారం సాయంత్రం బీజేపీ లెజిస్టేచర్ పార్టీ సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి రాజ్ నాథ్, జేపీ నడ్డా, ఇతర సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదిలావుండగా, ప్రభుత్వంలో చేరేందుకు శివసేన మంతనాలు సాగిస్తోంది.