కేరళ మంత్రులకు సీపీఎం సూచనలు
తిరువనంతపురం: కేరళలో మంత్రుల కోసం అధికార సీపీఎం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీ అనంతరం ఆ వివరాలను రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ వెల్లడించారు. మంత్రులు ప్రైవేట్ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని.. తప్పనిసరి వెళ్లాల్సి వస్తే పార్టీ అనుమతి తీసుకోవాలని అన్నారు.
ఇకపై వారంలో ఐదు రోజులు రాష్ట్ర రాజధానిలోనే ఉండాలని.. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. ఏ విషయంలోనైనా వాస్తవాలు తెలుసుకోకుండా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదన్నారు. న్యాయం కోసం మంత్రుల వద్దకు వచ్చిన ప్రజలు.. ఎవరూ సమస్య పరిష్కారం కాలేదన్న మాట రావద్దని, పార్టీ నేతలు, నాయకులతో కలసి పనిచేయాలని బాలకృష్ణన్ అన్నారు.
ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్లొద్దు
Published Mon, Jun 13 2016 2:02 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement
Advertisement