
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ టెస్టుల్లో రెండుసార్లు నెగటివ్ వచ్చిన ఢిల్లీకి చెందిన జూనియర్ డాక్టర్ ఒకరు గురువారం చనిపోయారు. ప్రాణాలు కోల్పోయేముందు ఛాతిలో నొప్పి, శ్వాసతీసుకోలేకపోవడం తదితర లక్షణాలు డాక్టర్ అభిషేక్ భయానాలో కనిపించాయని అతని సోదరుడు అమన్ వెల్లడించారు. ‘నాకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. ఈ లక్షణాలన్నీ కరోనావే.. నేను కచ్చితంగా కోవిడ్ పాజిటివ్’ అని అభిషేక్ తన చివరి మాటల్లో చెప్పినట్లు పేర్కొన్నారు. (కరోనాపై అలర్ట్ చేసింది చైనా కాదు: డబ్ల్యూహెచ్ఓ)
మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఫర్ డెంటల్ సైన్సెస్(మెయిడ్స్)లోని ఓరల్ సర్జీరీ డిపార్టుమెంట్లో అభిషేక్ పని చేస్తున్నారు. ఎయిమ్స్ ఎండీఎస్ పరీక్షలో జాతీయ స్థాయిలో 21వ ర్యాంకు తెచ్చుకున్న ఆయన జూన్ నెలలో హరియాణాలోని రోహ్తక్కు వెళ్లి వచ్చారు. అభిషేక్ అంత్యక్రియలను ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం నిర్వహించారు. (గ్రేటర్‌లో కరోనా విజృంభణ.. జనం హైరానా)
‘అభిషేక్ మంచి డాక్టర్. కరోనా లక్షణాలు ఉన్నా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ రాలేదు. ఆయన హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు’ అని మెయిడ్స్కు చెందిన ఓ సీనియర్ డాక్టర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment