‘మాల్యాలా చేయొద్దు.. భారత్‌కు తిరిగి రా’
న్యూఢిల్లీ: ఇమిగ్రేషన్ అధికారులకు మస్కా కొట్టి దుబాయ్‌కి ఎగిరిపోయిన మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషిని ఢిల్లీ హైకోర్టు బుధవారం విజయ్ మాల్యాతో పోల్చింది. మాల్యాలాగా విదేశాలకు పారిపోయి తిరిగిరాకుండా ఉండొద్దని వ్యాఖ్యానించింది. మీరు భారత్‌లో లేరంటే దానర్ధం కోర్టుకు హాజరు కావాలనుకోవడం లేదని తెలుస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది.
'ముందు, దేశానికి రండి, ఇంటరాగేషన్‌లో పాల్గొనండి' అని కోర్టు ఆదేశించింది. నవంబరు మధ్య కల్లా భారత్‌కు వచ్చి నవంబరు 22న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాత్కాలిక ఆదేశాలు జారీ చేసేది లేదని న్యాయస్థానం తేల్చి చెప్పా రు. తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులివ్వాలన్న ఖురేషీ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.
(చదవండి....ఇమిగ్రేషన్ అధికారులకు మొయిన్ ఝలక్!)