
ఈశాన్య భారతంలో భూకంపం
షిల్లాంగ్ : భారత్లోని ఈశాన్య ప్రాంతంతోపాటు బంగ్లాదేశ్లో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.9 గా నమోదు అయింది. బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతమైన అసోంలోని కరీంగంజ్ జిల్లాలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు భూకంప శాస్త్రవేత్తలు వెల్లడించారు.
అలాగే ఈశాన్య ప్రాంతంలోని మేఘాలయతోపాటు పలు రాష్ట్రాల్లో భూమి కంపించినట్లు చెప్పారు. అయితే ఈ భూకంపం వల్ల ఎక్కడ ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు తమకు సమాచారం అందలేదని ఉన్నతాధికారులు తెలిపారు.