‘సిక్కు వ్యతిరేక అల్లర్ల’ పరిహారంపై ఈసీ నిలదీత | EC censures government over hiked 1984 compensation | Sakshi
Sakshi News home page

‘సిక్కు వ్యతిరేక అల్లర్ల’ పరిహారంపై ఈసీ నిలదీత

Published Sat, Nov 8 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM

EC censures government over hiked 1984 compensation

న్యూఢిల్లీ: సిక్కు వ్యతిరేక అల్లర్ల (1984లో జరిగినవి) బాధితులకు తాజా పరిహారంపై ఎన్నికల సంఘం కేంద్రం తీరును తప్పుబట్టింది. బాధితులకు తాజా పరిహారం ఇచ్చే విషయమై నిర్ణయం తీసుకోకపోతే... మీడియా వార్తలను ఎందుకు ఖండించలేదని సర్కారును నిలదీసింది. ఈ వైఖరితో పరిహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందేమోనన్న అభిప్రాయానికి దారితీస్తుందని ఈసీ  పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావద్దంది.

 

ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు ముందు అక్కడి 3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయటంతో. కోడ్ అమల్లో ఉండగా, నాటి సిక్కు అల్లర్ల బాధితులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వనుందంటూ వార్తలు రావడంతో ఈసీ కేంద్ర హోంశాఖకు 31న నోటీసులిచ్చింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement