ఢిల్లీ: డిసెంబర్లో జరగాల్సిన ఆర్థిక మంత్రుల సమావేశాన్ని బడ్జెట్కు 15 రోజుల ముందు నిర్వహిస్తున్నారని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. రాష్ట్రాల ప్రతిపాదనలు తీసుకోవాలని కేంద్రానికి ఉద్దేశం లేదని ఆయన ఆరోపించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏదో తూతూ మంత్రంగా ఆర్థిక మంత్రుల సమావేశం పెట్టారని మండిపడ్డారు.
బహుళజాతి కంపెనీలకే ప్రధాని నరేంద్ర మోదీ సహకరిస్తున్నారని విమర్శించారు. ఎఫ్ఆర్డీఎమ్ 3.5 శాతం పెంచాలని కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. కేంద్ర పథకాల్లో కోతలు కోసి అనేక కేంద్ర పథకాలకు నిధులు తగ్గించేశారని ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బహుళ జాతి కంపెనీలకే మోదీ సహకారం: ఈటల
Published Sat, Feb 6 2016 3:46 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement