
మామిడి రైతులకి తీపి వార్త
యూరోపియన్ యూనియన్ మామిడి పండ్ల దిగుమతుల ఉన్న నిషేదాన్ని ఎత్తేసింది.
యూరోపియన్ యూనియన్ గత సంవత్సరం భారత మామిడి పండ్ల దిగుమతిపై నిషేధం విధించింది. ఈ నిషేదం గడువు డిసెంబర్ 2015 వరకు ఉన్నప్పటికీ ముందుగానే ఈ నిషేదాన్ని ఎత్తేసింది.
భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న మామిడి పళ్ల పై జరిపిన తనిఖీల్లో అధిక మోతాదులో రసాయనాల వినియోగం ఉన్నాయని తెలడంతో వీటిపై నిషేదం విధించారు. ఈ దిగుమతులపై ఉన్న నిషేదాన్ని ఎత్తేయడానికి బ్రిటీష్ పార్లమెంట్లోని భారత సంతతికి చెందిన పార్లమెంట్ సభ్యులు చాలా కృ఼షి చేశార. వంకాయ, కాకరకాయ, పొట్లకాయలపై ఉన్న నిషేదం ఇంకా అలానే కొనసాగనుంది. మామిడి దిగుమతి సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు కొనసాగుతుంది. ఈ నిషేదం ఎత్తివేతతో మన దేశంలోని మామిడి రైతులకు ఊరట లభించింది.