
'వినోద్ మెహతాను ఆదర్శంగా తీసుకోండి'
ఢిల్లీ: నేటితరం జర్నలిస్టులకు దివంగత జర్నలిస్టు వినోద్ మెహతా ఆదర్శం కావాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. శనివారం జీకే రెడ్డి స్మారక అవార్డును వినోద్ మెహతా భార్య సునీత మెహతాకు సోనియా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. నిబద్ధత, సమర్ధతకు మరోపేరే వినోద్ మెహతా అని కొనియాడారు.
కాంగ్రెస్ పై ఆయన చేసే విమర్శలను నిర్మాణాత్మకంగా తీసుకునేవాళ్లమని సోనియా గాంధీ అన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య విలువల కోసం వినోద్ మెహతా తన కలాన్ని ఝుళిపించేవారన్నారు.