జడ్జీ పోస్టుల ఖాళీలపై కేంద్రం
న్యూఢిల్లీ: జడ్జీల నియామకాల్లో జాప్యం అవుతోందంటూ సుప్రీం కోర్టు మండిపడడం తో కేంద్రం స్పందించింది. గతంలో 906 హైకోర్టు జడ్జీల పోస్టులు మంజూరైతే.. వాటిని 1,079కి పెంచామంది. ప్రస్తుత ఎన్డీఏ పాలనలో హైకోర్టులో పోస్టుల ఖాళీలు అసాధారణంగా ఏమీ పెరిగిపోలేదని తెలిపింది. ప్రతి ఏటా మాదిరే గత రెండేళ్లు కూడా భర్తీల సగటు కొనసాగిందని చెప్పింది.
ఎన్‌జేఏసీ విచారణ వల్ల 2015 ఏప్రిల్, డిసెంబర్ మధ్య జడ్జిల నియామకాలు జరగకపోయినా సగటులో తేడారాలేదని తెలిపింది. న్యాయవ్యవస్థపై ప్రభుత్వానికి ఎనలేని గౌరవం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, భర్తీ విషయంలో అన్ని విధాల కృషి చేస్తున్నామని ఆ వర్గాలు తెలిపాయి.
అసాధారణంగా ఏమీ పెరగలేదు
Published Sun, Oct 30 2016 1:02 AM | Last Updated on Sat, Oct 20 2018 5:26 PM
Advertisement
Advertisement