ఈ ఫొటోలోని చిన్నారికి కరోనా లేదు | Fact Check: Do Not Believe This Emotional Viral Story | Sakshi
Sakshi News home page

ఈ వైరల్‌ స్టోరీని నమ్మొద్దు

Published Sat, Apr 25 2020 2:41 PM | Last Updated on Sat, Apr 25 2020 2:41 PM

Fact Check: Do Not Believe This Emotional Viral Story - Sakshi

ఈ ఫొటో కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్లాస్టిక్‌ కవర్‌లో ఉన్న చిన్నారిని సైనికుడొకరు హత్తుకున్నట్టుగా ఫొటోలో కన్పిస్తోంది. తన కూతురిలో కరోనా వైరస్‌ రోగ లక్షణాలు కన్పిస్తున్నాయని, ఆమె కోవిడ్‌ బారినపడకుండా దేవుడిని ప్రార్థించాలని కోరుతూ ఫేస్‌బుక్‌లో ఈ ఫొటోను షేర్‌ చేశారు. పసిప్రాయంలోనే తల్లిని పోగొట్టుకుందని, ఇప్పుడు కూతురిని పోగొట్టుకోవడానికి తాను సిద్ధంగా లేనని అతడు పేర్కొన్నాడు. తన కూతురికి కరోనా నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్‌ రావాలని ఈ ఫొటోను 5 ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో షేర్‌ చేయాలని వేడుకున్నాడు. మీ ప్రార్థనలతో నా కుమార్తె కోలుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నట్టు ఎఫ్‌బీ పోస్ట్‌లో పేర్కొన్నారు. పాప కోలుకుంటుందన్న ఆశతో చాలా మంది ఈ ఫొటోను షేర్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ఇది మలేసియాకు చెందిన ఫొటో అని, ప్లాస్టిక్‌ కవర్‌లో ఉన్న చిన్నారి బాలిక కాదని ‘ఇండియ టుడే’ నకిలీ వార్తల నియంత్రణ విభాగం తేల్చింది. ముందుగా ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారని, మలయ్‌ భాషలో ఫొటో గురించి వివరణ ఉందని వెల్లడించింది. కరోనా విధుల్లో భాగంగా ఓ సైనికుడు చాలా రోజుల పాటు కుటుంబానికి దూరంగా ఉన్నాడు. తన తండ్రిని కలుకోవాలని అతడి కొడుకు పట్టుబట్టడంతో ఈవిధంగా కలుసుకునే ఏర్పాటు చేసినట్టు మలేసియా వార్తా పత్రిక ‘సినార్‌ హరియన్‌’ వెల్లడించిందని తెలిపింది. మరికొన్ని మలేసియా న్యూస్‌ వెబ్‌సైట్లలో కూడా ఈ ఫొటోను ప్రచురించారు. ఈ ఫొటోలోని  పిల్లాడికి  కరోనా లేదని, తన కొడుకు కోసం ప్రార్థించమని అతడి తండ్రి అడగలేదని స్పష్టమైంది. ప్రజల భావోద్వేగాలతో ఆడుకునేందుకు ఆకతాయిలు ఈ ఫొటోను వైరల్‌ చేసినట్టు అర్థమవుతోంది. సోషల్‌ మీడియాలో వచ్చే ఫొటోలను షేర్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.

చదవండి: ఆటో డ్రైవర్‌కు ఆనంద్‌ మహింద్రా ఆఫర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement