ప్రియుడ్ని పెళ్లాడుతానన్నందుకు కాలువలో తోసేశారు | Family throws woman into canal for wanting to marry lover | Sakshi
Sakshi News home page

ప్రియుడ్ని పెళ్లాడుతానన్నందుకు కాలువలో తోసేశారు

Published Wed, Apr 27 2016 1:14 PM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM

ప్రియుడ్ని పెళ్లాడుతానన్నందుకు కాలువలో తోసేశారు

ప్రియుడ్ని పెళ్లాడుతానన్నందుకు కాలువలో తోసేశారు

ముజఫర్నగర్: పెద్దలకు ఇష్టంలేకుండా ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ యువతిని కుటుంబ సభ్యులు నదిలో తోసేశారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ ప్రాంతంలోని నిర్గజ్ని గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

నిర్గజ్ని గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువతి ఓ యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ యువతి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా వారు పెళ్లికి నిరాకరించారు. కుటుంబ సభ్యులు ఆమెను తీసుకెళ్లి.. గంగా నదిలో కలిసే కాలువలోకి తోసేశారు. కాగా కొందరు గ్రామస్తులు గమనించి ఆ యువతిని రక్షించారు. పోలీసులు యువతి తండ్రి, సోదరుడిపై కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement