రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతుళ్లు మృతి
Published Sun, Mar 5 2017 10:13 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్ హౌరా జిల్లాలోని మౌఖాలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తండ్రి, కూతురు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న వారిని అటువైపుగా వెళ్తున్న బస్సు మరో బస్సును ఓవర్ టెక్ చేసే సమయంలో బైక్‌కు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు పోలీస్ అధికారి తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందారని డాక్టర్లు నిర్దారించారు.
పోలీసుల కథనం ప్రకారం.. నామ్ అన్సారీ(52), నేహ అన్సారీ(22)లు తండ్రీకూతురని తెలిసింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని చెప్పారు. ఆ బస్సును ఛేజ్ చేసి పట్టుకున్నామని, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్, అతని సహయకుడు సంఘటన స్థలం నుంచి పరారయ్యారని తెలిపారు. వారికోసం వెతుకుతున్నామని త్వరలోనే పట్టుకుంటామని వివరించారు.
Advertisement
Advertisement