ఆర్థికమంత్రి కూడా అబద్ధాలాడారు | finance minister lied in parliament, says arvind kejriwal | Sakshi
Sakshi News home page

ఆర్థికమంత్రి కూడా అబద్ధాలాడారు

Dec 15 2015 2:28 PM | Updated on Sep 3 2017 2:03 PM

ఆర్థికమంత్రి కూడా అబద్ధాలాడారు

ఆర్థికమంత్రి కూడా అబద్ధాలాడారు

పార్లమెంటులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా అబద్ధాలు ఆడారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.

పార్లమెంటులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా అబద్ధాలు ఆడారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తన సొంత కార్యాలయంలో ఫైళ్లను చూస్తున్నారని, తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించేందుకే ఇలా చేస్తున్నారని ట్వీట్ చేశారు. రాజేంద్ర కుమార్ అన్నది కేవలం ఒక సాకు మాత్రమేనన్నారు.

ఇక సీఎం కార్యాలయాన్ని సీజ్ చేయడంపై తాను షాక్ తిన్నానని, ఇలాంటిది ఇంతకు ముందెప్పుడూ లేదని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా ట్వీట్ చేయగా, దానికి సమాధానం ఇస్తూ.. ఇది అప్రకటిత ఎమర్జెన్సీలా ఉందని కేజ్రీ అన్నారు. ఒకవేళ రాజేంద్రకుమార్ తన కార్యదర్శి కాకపోతే ఈ దాడులు జరిగేవా అని ప్రశ్నించి.. జరిగేవి కాదని తానే సమాధానం ఇచ్చారు. అప్పుడు టార్గెట్ ఎవరు.. రాజేందరా తానా అని మరో ప్రశ్న సంధించారు. 2002 సంవత్సరంలో షీలా దీక్షిత్ అవినీతి వ్యవహారం జరిగితే 2015లో కేజ్రీవాల్ మీద సీబీఐ దాడులు జరిగాయని.. 'వహ్.. మోదీజీ' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement