మహిళా ఉద్యోగిని వేధించినందుకు మంత్రిపై కేసు | FIR against Bihar minister for mental harassment | Sakshi
Sakshi News home page

మహిళా ఉద్యోగిని వేధించినందుకు మంత్రిపై కేసు

Published Fri, Dec 6 2013 3:12 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

FIR against Bihar minister for mental harassment

 దూరదర్శన్లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగిని మానసికంగా వేధించినందుకు బీహార్ రాష్ట్ర మంత్రి శ్యామ్ రాజక్పై పోలీసు కేసు నమోదు చేశారు. పాట్నా దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న 45 ఏళ్ల మహిళ మంత్రిపై ఫిర్యాదు చేసింది.

గత నెల 22న మంత్రి ఫోన్ చేసి తనను బెదిరించారని ఆమె ఆరోపించారు. అంతేగాక రెండు రోజుల క్రితం కొందరు అసాంఘిక వ్యక్తులు తన ఇంటికి వచ్చి మంత్రి పేరు చెప్పి బెదిరించారని ఆమె చెప్పారు. దీంతో పాట్నా శాంతినగర్ పోలీస్ స్టేషన్లో మంత్రిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన వెలుగుచూసిన తర్వాత మంత్రి రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. కాగా ఇదంతా రాజకీయ కుట్రని మంత్రి ఈ ఆరోపణల్ని కొట్టిపారేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement