ఢిల్లీ:నగరంలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షహీన్ బాగ్ ఫర్నీచర్ మార్కెట్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది 20 ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పుతున్నారు.