
భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్రం రూర్కెలాలోని బాణసంచా మార్కెట్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. మంటల్లో 45 దుకాణాలు, 22 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఆరు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.