హర్యానాలో విమాన ధరలకు రెక్కలు
హర్యానా: హర్యానాలో జాట్‌ల ఆందోళన నేపథ్యంలో విమాన ధరలకు కొత్తగా రెక్కలొచ్చాయి. సాధారణ రోజుల్లో మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల వరకు టికెట్ ధర ఉండేది. తాజాగా జాట్‌ల ఉద్యమం ఎఫెక్ట్‌తో.. ఛండీగఢ్-ఢిల్లీ మధ్య వెళ్లే విమానాలకు ఒక్క టికెట్ ధర 27 వేలకు పలుకుతోంది.
కాగా, కాగా, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న జాట్ల ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగుతోంది. ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.