
మరో నలుగురి అరెస్ట్
కోల్కతా: 72సం.రాల నన్ గ్యాంగ్రేప్ కేసులో నలుగురి నిందితులను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
బంగ్లాదేశీయులైన ఈ నలుగురు పంజాబ్ మోతీనగర్ ఏరియాలో దొరికారని డీసీపీ నవీన్ సింగ్లా తెలిపారు.
సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా పశ్చిమ బెంగాల్ గంగ్నాపూర్ లో క్రైస్తవ సన్యాసినిపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితుల్ని అరెస్టు చేయకపోవడంపై జాతీయ మహిళా కమిషన్ మండిపడింది.
అయితేసంఘటన జరిగిన వెంటనే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కాగా సీబీఐ అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితుడు సలీం సహా ఇద్దర్ని ముంబైలో అరెస్ట్ చేశారు.
మార్చి 13 అర్ధరాత్రి స్కూల్ లోకి చొరబడ్డ పన్నెండుమంది దొంగలు నన్ పై సామూహిక లైంగికదాడిచేయడంతోపాటు రూ.12 లక్షలు దోచుకెళ్లిన సంగతి తెలిసిందే.