కారు బీభత్సం.. నలుగురి మృతి | four dies in Car hits two wheeleres incident | Sakshi
Sakshi News home page

కారు బీభత్సం.. నలుగురి మృతి

Published Sun, Sep 3 2017 6:34 PM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM

four dies in Car hits two wheeleres incident

చెన్నై: కృష్ణగిరి- చెన్నై జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి ద్విచక్రవాహనాలపై వెళ్తున్న వారిపై దూసుకెళ్లడంతో నలుగురు మృతిచెందారు. రోడ్డు దాటుతున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో కృష్ణగిరి జిల్లా కందికుప్పం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

కందికుప్పం వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ఈ విషయంపై స్థానికులు అధికారులకు తెలిపినా వారు పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు రోడ్డుపై బైఠాయించడమేకాక టైర్లకు నిప్పుపెట్టారు. ప్రమాదానికి కారణమైన కారును ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. పొలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో లాఠీచార్జీ చేసి ఆందోళనకారులకు చెదరగొట్టి ట్రాఫిక్‌ను నియంత్రించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement