రాహుల్‌పై బీజేపీ నేతల ఫిర్యాదు
సాక్షి, బెంగళూర్: సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య అనంతరం ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలపై వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కర్నాటక బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిక్‌మగుళూర్ పోలీసు స్టేషన్‌లో బీజేపీ కార్యకర్తలు రాహులపై ఫిర్యాదు చేశారు.గౌరీ లంకేష్ హత్యపై రాహుల్ స్పందిస్తూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని బెదిరించడం, దాడిచేయడం, హతమార్చడం పరిపాటైందని వ్యాఖ్యానించిన విషయం విదితమే.
ఈ ఘటనపై ప్రధాని మౌనందాల్చడం చూస్తుంటే అసమ్మతిని అణిచివేయడమే వారి సిద్ధాంతమని స్పష్టమవుతుందని కూడా రాహుల్ అన్నారు. ప్రధాని, పార్టీ నేతలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను కర్నాటక బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఆయనపై చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.