‘ఎస్‌ఎఫ్‌ఐ... ఇదేం పని’  | Gaza photo showed by Pakistan in UN, claims BJP | Sakshi
Sakshi News home page

 ‘ఎస్‌ఎఫ్‌ఐ... ఇదేం పని’ 

Published Fri, Sep 29 2017 12:07 PM | Last Updated on Fri, Sep 29 2017 1:46 PM

Gaza photo showed by Pakistan in UN, claims BJP

సాక్షి, న్యూఢిల్లీ: కేరళ ప్రచారంలో ఎస్‌ఎఫ్‌ఐ వాడిన గాజా ఘర్షణల్లో గాయపడ్డ బాలిక ఫోటోనే కాశ్మీర్‌లో పెల్లెట్‌ గన్‌లకు గాయపడ్డ బాలికగా ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో​ పాక్‌  ప్రదర్శించిందని బీజేపీ ఆరోపించింది. ఐరాసలో పాక్‌ శాశ్వత రాయబారి మలీహ లోథికి ఎస్‌ఎఫ్‌ఐ ఈ ఫోటోను అందించిందా అని ఆ పార్టీ సందేహం వ్యక్తం చేసింది. ఎస్‌ఎఫ్‌ఐ తీరును ఆక్షేపిస్తూ బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిట్‌ పాత్రా ట్వీట్‌ చేశారు.

ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పాక్‌ రాయబారి లోథి గాజా ఘర్షణల్లో గాయపడ్డ బాలిక ఫోటోను చూపుతూ ఆ ఫోటో కాశ్మీర్‌లో పెల్లెట్‌ గన్‌ బాధితురాలిగా పేర్కొంది. అయితే ఆ ఫోటో ఇజ్రాయిల్‌ దాడుల్లో గాయపడ్డ 17 ఏళ్ల గాజా బాలిక రవ్యా అబు జోమాగా ఆ తర్వాత వెల్లడైంది. అవార్డు ‍గ్రహీత అమెరికన్‌ ఫోటో జర్నలిస్ట్‌ హైదీ లెవిన్‌ 2014 జులైలో ఈ ఫోటోను తీసినట్టు తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement