
చెప్పుతో ఎడాపెడా వాయించేసింది..
నపట్ల అనుచితంగా ప్రవర్తించిన ఈవ్ టీజర్లను దొరకబుచ్చుకుని మరీ...ఉతికి ఆరేసిందో యువతి. మధ్యప్రదేశ్ తికాంగ్రా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది
భోపాల్: ఆకతాయిలు పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే ఎవరికైనా ఒళ్లు మండుతుంది. ఈ వేధింపులను చాలామంది యువతులు, మహిళలు మౌనంగా సహిస్తారే తప్ప, ఫిర్యాదు దాకా వెళ్లరు. గొడవెందుకులే అని మిన్నకుండిపోయేవాళ్లే ఎక్కువమంది. కానీ ఆ సంఘటన, ఆ అవమానం మళ్ళీ మళ్లీ గుర్తొచ్చి మనసును బాధిస్తూనే ఉంటుంది. అయితే ఆకతాయిల చేష్టలు శ్రుతిమించితే ఒక్కోసారి చిర్రెత్తుకొస్తుంది.
అలాంటప్పుడు వాళ్లు చేతికి చిక్కితేనా అనిపిస్తుంది కదా... అలా చేతికి చిక్కిన కాదు..కాదు.. తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఈవ్ టీజర్లను దొరకబుచ్చుకుని మరీ ఉతికి ఆరేసిందో యువతి. మధ్యప్రదేశ్ తికాంగ్రా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెకిలి చేష్టలతో వేధిస్తున్న ఇద్దరు యువకులపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకొచ్చారు. ఆకతాయిలను చూడగానే ఆవేశంగా రగిలిపోయిన ఆ యువతి చెప్పుతో ఎడాపెడా వాయించేసింది. పోలీసుల సమక్షంలోనే ఇద్దరినీ ఉతికి ఆరేసింది. ఈ వీడియో ఇపుడు నెట్లో హల్చల్ చేస్తోంది.