'ఇండియన్ కంటే గోవన్ గొప్ప' | Goan identity higher than national identity says suresh prabhu | Sakshi
Sakshi News home page

'ఇండియన్ కంటే గోవన్ గొప్ప'

Published Sat, Jun 27 2015 7:24 PM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

'ఇండియన్ కంటే గోవన్  గొప్ప'

'ఇండియన్ కంటే గోవన్ గొప్ప'

పణాజి: 'ఈ దేశంలో పుట్టిన అందరికీ ఇండియన్ అనే ఐడెంటిటీ గొప్పగా అనిపించొచ్చు. కానీ గోవా ప్రజలకు మాత్రం ఇండియన్గా కంటే గోవన్ అనే గుర్తింపే గొప్పది..' ఇవేవో ప్రాంతీయ ఉద్యమకారులు చేసిన వ్యాఖ్యలు కాదు. సాక్షాత్తు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు అన్న మాటలు. శనివారం గోవాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ కామెంట్లు చేశారు.

'ఓసారి గోవా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజాతో కలిసి పోర్చుగల్ వెళ్లను. అక్కడివాళ్లందరూ ప్రాన్సిస్ను ఇండియన్గా కంటే గోవన్ గానే గుర్తించడం నన్ను ఆశ్చర్యపరిచింది. భౌగోళికంగా గోవా మిగిలిన అన్ని రాష్ట్రాల వంటిదే కావచ్చు కానీ చారిత్రక, సంస్కృతిక వారసత్వాల దృష్ట్యా ఈ రాష్ట్రానికి ఓ ప్రత్యేకత ఉంది' అని సురేశ్ ప్రభు అన్నారు. తన అత్తారిల్లు కూడా గోవాలోనే ఉందని, సతీమణి ఉమ పణాజీ సమీపంలోని రిబాందర్ లో పుట్టిపెరిగారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement