న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని వస్తు–సేవల పన్ను(జీఎస్టీ) మండలి గత రెండేళ్లలో 30 సార్లు సమావేశమైందని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ కాలంలో జీఎస్టీకి సంబంధించి మొత్తం 918 నిర్ణయాలను తీసుకున్నట్లు వెల్లడించింది. ఇందులో జీఎస్టీ విధి విధానాలు, రేట్లు, పరిహారం తదితర నిర్ణయాలు ఉన్నాయని పేర్కొంది. ఇప్పటికే సుమారు 96 శాతం నిర్ణయాలను అమలు చేశామని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని చెప్పింది. ఈ నిర్ణయాలు అమలుకు కేంద్రం, ప్రతి రాష్ట్రం 294 నోటిఫికేషన్ జారీ చేసినట్లు వెల్లడించింది. ఒకే దేశం– ఒకే పన్ను నినాదంతో 2000లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ జీఎస్టీకి శ్రీకారం చుట్టింది. ఎట్టకేలకు సుమారు 17 ఏళ్ల తర్వాత గతేడాది జూన్ 30వ తేదీ అర్ధరాత్రి జీఎస్టీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment