ఇలాకూడా ‘హెచ్-1బీ వీసా’ పొందొచ్చు!
న్యూఢిల్లీ : విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లిన విద్యార్థులు.. అక్కడ చదువుకుంటూ పనిచేసుకోవాలంటే హెచ్-1బీ వీసా తప్పని సరి. ఈ వీసా కావాలంటే ఏటా ఇచ్చే 85వేల హెచ్-1బీ వీసాల కోసం లాటరీలో అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది. కానీ, వర్సిటీ ఉద్యోగులు, వర్సిటీలకు బయటనుంచి పనిచేసే వారికి ఈ లాటరీ నుంచి మినహాయించి.. నేరుగా హెచ్-1బీ వీసా ఇస్తారు. దీనివల్ల వర్సిటీలో పనిచేయటంతోపాటు బయట వేరే వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు.
అయితే అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టంలోని ‘వర్సిటీల ఉద్యోగులకు మినహాయింపు’ అనే లొసుగును వాడుకుంటూ బాబ్సన్‌తోపాటు పలు వర్సిటీలు తమ విద్యార్థులకు ఈ వీసాలిప్పిస్తున్నాయని విద్యారంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నా.. కొన్ని విద్యాసంస్థలు పంపించిన వారికే ఈ వీసాలు రావటమే ఇందుకు నిదర్శనమని వారంటున్నారు.