జమ్మూ: అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా నకిలీ రిజిస్ట్రేషన్ల బెడదకు అడ్డుకట్ట వేసేం దుకు అమర్‌నాథ్ ఆలయ బోర్డు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది నుంచి అమర్‌నాథ్ యాత్రికులకు హైసెక్యూరిటీ యాత్రా పర్మిట్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జమ్మూకాశ్మీర్ గవర్నర్ ఎన్‌ఎన్ వోరా అధ్యక్షతన ఈ నెల 20న జరిగిన అమర్‌నాథ్ ఆలయ బోర్డు సమావేశం.. కొత్త యాత్రా పర్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్‌కు ఆమోదముద్ర వేసింది. హిమగిరుల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందు కు ఏటా లక్షలాది మంది భక్తులు అమర్‌నాథ్ యాత్రకు వస్తారు.కొత్త పర్మిట్లను ఒక్కో రోజు ఒక్కో రంగులో.. రూట్ల వారీగా రూపొంది స్తారు. యాత్ర ఈ ఏడాది జూన్ 28న ప్రారంభమై.. ఆగస్టు 10తో ముగియనుంది.