సిమ్లా : కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, పార్లమెంటరీ మాజీ చీఫ్ సెక్రటరీ నీరజ్ బారతీని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక, అభ్యంతరకరమైన పోస్టులు చేసిన కారణంతో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు హిమాచల్ ప్రదేశ్ క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. ఇటీవలె తూర్పు లద్ధాఖ్‌లోని గాల్వన్ లోయలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై ఫేస్‌బుక్ వేదికగా అసభ్య పదజాలంతో విమర్శలు గుప్పించారు. ఈ ఘటనలో 20 మంది భారత ఆర్మీ సైనికులు చనిపోవడానికి మోదీయే కారణమంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. (గోవాలో కరోనా సామాజిక వ్యాప్తి: సీఎం )
ఈ పోస్టులపై పెద్ద ఎత్తున దుమారం చేలరేగడంతో పాటు పలు బీజేపీ నేతలు ప్రతి విమర్శలు చేస్తూ ఎదురు దాడికి దిగారు. ప్రజల్లో ద్వేషాన్ని పెంపొందించేలా కాంగ్రెస్ నాయకుడు నీరజ్ దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ సిమ్లాకు చెందిన న్యాయవాది నరేంద్ర గులేరియా ఫిర్యాదు చేశారు. దేశ ప్రధానిని అవమానిస్తూ అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించరంటూ న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నీరజ్ బారితిని అరెస్ట్ చేసి శనివారం మెజిస్ర్టేట్ ఎదుట హాజరుపరుస్తామని క్రైమ్ బ్రాంచ్ ప్రతినిధి ఖుషల్ శర్మ అన్నారు. కాగా నీరజ్.. జవాలీ నియోజక వర్గానికి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా కాంగ్రెస్ హయాంలో పార్లమెంటరీ మాజీ సెక్రటరీగానూ పనిచేశారు. (కరోనాతో సీనియర్ వీడియో జర్నలిస్టు కన్నుమూత )
Comments
Please login to add a commentAdd a comment