అసోం గవర్నర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు! | Hindustan is for Hindus: Assam governor | Sakshi
Sakshi News home page

అసోం గవర్నర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు!

Published Sun, Nov 22 2015 10:09 AM | Last Updated on Sun, Sep 3 2017 12:51 PM

అసోం గవర్నర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు!

అసోం గవర్నర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు!

గువాహటి: హిందుస్థాన్ హిందువుల దేశమని,  నేషనల్ రిజిస్టర్ ఫర్‌ సిటిజెన్స్ (ఎన్‌సీఆర్) ఆధునీకరణలో ఒక్క బంగ్లాదేశీ పేరు కూడా నమోదుచేయకుండా చూడాలని అసోం గవర్నర్‌ పీబీ ఆచార్య పేర్కొన్నారు. ఓ పుస్తకం విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్‌సీఆర్‌ ఆధునీకరణలో భాగంగా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వలసవచ్చిన శరణార్థులకు భారత్‌లో ఆశ్రయం కల్పించేందుకు కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీచేయడంపై వివాదం తలెత్తగా.. ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు భారత్‌లో ఆశ్రయం పొందవచ్చునని, ఇతర దేశాల్లోని హిందువుల్లో భారత్‌లో ఆశ్రయం పొందడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన పేర్కొన్నారు.

'హిందుస్థాన్ హిందువుల దేశం. ఈ విషయంలో ఏ సందేహాలకు తావు లేదు. వివిధ దేశాల్లోని హిందువులంతా ఇక్కడ నివసించవచ్చు. ఇందుకు భయపడాల్సిన అవసరం లేదు. అయితే, వారికి ఎలా ఆశ్రయం కల్పించాలన్నదే పెద్ద ప్రశ్న. దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరముంది' అని ఆయన పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement