Hindustan
-
పైజామా జేబులో బొంగరం
‘అర్ధరాత్రి సమయం. అమ్మ నగలన్నీ వేసుకుంది. తక్కినవి మూట కట్టుకుంది. నాకంటే ఆరేళ్లు చిన్నది చెల్లెలు. దానికి పాలు బాగా తాగించి భుజాన వేసుకుంది. నేను మాత్రం నాకున్న ఒకే ఒక ఆస్తి బొంగరాన్ని నా పైజామా జేబులో పెట్టుకున్నాను. అందరం కాందిశీకులంగా మారి ఆవలి సరిహద్దుకు బయలుదేరాం. చీకటి. భీతి గొలుపుతున్న అరణ్యమార్గం. అందరి కళ్లు చీమ చిటుక్కుమన్నా రెప్పలు విప్పార్చి భయంతో, కోపంతో మొరిగినట్టుగా చూస్తున్నాయి. నడిచాం.. నడిచాం.. అమ్మ రక్తపు వాంతి చేసుకుంది. చెల్లి భుజం నుంచి జారి మట్టిలో కలిసిపోయింది. నేను నా బాల్యాన్ని అక్కడే భూస్థాపితం చేసి ఇటువైపుకు చేరుకున్నాను’... గుల్జార్ కవిత ఇది. దేశ విభజన సమయంలో అతనికి పన్నెండు పదమూడేళ్లు ఉంటాయి. నేటి పాకిస్తాన్ లోని జీలం నుంచి వాళ్ల కుటుంబం ఢిల్లీకి చేరుకుంది. రెఫ్యూజీ క్యాంప్‌లో గుల్జార్ బాల్యం గడిచింది. ఇక్కడకొచ్చాక కూడా వీళ్లుంటున్న రోషనారా రోడ్, సబ్జీమండీల్లో నరమేధాన్ని చూశాడు. ‘మా స్కూల్లో రోజూ ప్రేయర్ చదివే కుర్రాణ్ణి చంపారు’ అంటాడు. ‘సబ్జీమండీలో శవాల మీద పాత కుర్చీలు, విరిగిన మంచాలు వేసి తగలబెట్టడం చూశాను’ అంటాడు. ‘ఇరవై ముప్పై ఏళ్లు అవే పీడకలల్లో వెంటేడేవి’ అని వగస్తాడు. సిక్కులు కష్టజీవులు. గుల్జార్ తండ్రి టోపీలు, చేతిసంచుల దుకాణం తెరిచాడు. పాకిస్తాన్ నుంచి వచ్చిన సిక్కులు ‘మా ఊరివాడు ఒక్కడు కనిపించినా చాలు’ అని వెతుక్కుంటూ తిరిగేవారు. కొందరు గుల్జార్ తండ్రి దగ్గరకు వచ్చి గుల్జార్ వాళ్ల ఇంట్లోనే తల దాచుకునేవారు. ‘మా ఇల్లే ఒక రెఫ్యూజీ క్యాంప్‌గా మారింది. నాకు పడుకోవడానికి చోటే లేదు’ అని చెప్పుకున్నాడు గుల్జార్. ఇదీ ఒకందుకు మంచిదే అయ్యింది. గుల్జార్‌కు కరెంటు లేని స్టోర్‌రూమ్ ఇవ్వబడింది. ఒకడే కుర్రవాడు.. తోడుగా లాంతరు. వీధి చివరకు వెళ్లి పావలా ఇస్తే వారంలో ఎన్ని పుస్తకాలైనా అద్దెకు తెచ్చుకోవచ్చు. అలా గుల్జార్ పఠనం స్టోర్‌రూమ్‌లో లాంతరు కింద మొదలైంది. ‘ఒకరోజు ఒక పుస్తకం అద్దెకు తెచ్చుకున్నాను. అది ఇంతకుముందు చదివిన పుస్తకాల వలే లేదు. చదివాను. మరసటి రోజు అదే రచయిత రాసిన మరో పుస్తకం చదివాను. భలే అనిపించింది. ఆ తర్వాత ఆ రచయిత సెట్ అంతా ఉర్దూలో ఉంటే తెచ్చుకుని చదివాను. దారీ తెన్నూ లేని ఒక కాందిశీక పిల్లవాడి జీవితాన్ని మార్చడానికే బహుశా ఆ రచయిత నాకు తారసపడ్డాడేమో. అతని పేరు రవీంద్రనాథ్ టాగోర్’ అంటాడు గుల్జార్. ఇంటి నిండా కాందిశీక బంధుమిత్రులు ఉండిపోవడంతో గుల్జార్‌కు జరిగిన మరో మంచి బొంబాయిలో ఉన్న సోదరుడి దగ్గర ఉండమని తండ్రి పంపించడం. అక్కడే గుల్జార్ సొట్టలుపోయిన కార్లకు పెయింట్ వేసే పని మొదలెట్టాడు. అప్పటికే అతడికి రంగులు తెలుసు. బొమ్మలు తెలుసు. కవిత్వంలోని పదచిత్రాలు తెలుసు. ‘ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ’ (పి.డబ్బ్యు.ఏ) వారాంతపు మీటింగ్‌లకు వెళ్లి కవిత్వం చదివితే సినీకవి శైలేంద్ర మెచ్చుకుని బిమల్ రాయ్‌కు పరిచయం చేశాడు. ‘కార్లకు పెయింట్ వేయడం కంటే సినిమాల్లో రాస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి’ అని బిమల్ రాయ్ ‘బందిని’లో మొదటి పాట రాయించాడు– ‘మోర గోర అంగ్ లైలె’. తర్వాత గుల్జార్ హృషీకేశ్ ముఖర్జీకి ప్రధాన అనుచరుడయ్యాడు. ఆ తర్వాత సాగిందంతా గుల్జార్ జైత్రయాత్ర. గుల్జార్ కవి, రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, సినీ కవి, మాటల రచయిత, దర్శకుడు. అనువాదకుడు, బాలల రచయిత, టెలివిజన్ డైరెక్టర్... ‘హర్ ఫన్ మౌలా’. సకల కళాకోవిదుడు. ‘నేను నా దేశవాసుల మనోఫలకం మీద కవిగా మిగలాలని కోరుకుంటున్నా’ అని అభిలషిస్తాడు గుల్జార్. అయితే మన దేశంలో పాప్యులర్ కల్చర్‌లో ఉన్న వ్యక్తి సీరియస్ సాహిత్యంలో ఎంత పని చేసినా ఎంతో ఎరుకతో వ్యవహరిస్తే తప్ప సాహిత్యముద్రను ముందువరుసలో పొందలేడు. గుల్జార్ సాహిత్యకృషి కంటే అతని సినిమా కృషే ఎప్పుడూ ముందుకొస్తూ ఉంటుంది. గుల్జార్ కవిత్వానికి ఉన్న పాఠకుల కంటే అతని సినిమా పాటలకు ఉన్న శ్రోతలు విస్తారం కావడమే కారణం. చిత్రమేమిటంటే గుల్జార్‌కు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ వచ్చినప్పుడు ఆనందించినవారు ఎందరో మొన్న ‘జ్ఞానపీఠ్’ ప్రకటించినప్పుడు సంతోషించినవారు అందరు. ఇలా ‘దాదాసాహెబ్’, ‘జ్ఞానపీఠ్’ రెండూ అందుకున్న సృజనమూర్తి మన దేశంలో ప్రస్తుతానికి మరొకరు లేరు. ‘ఎప్పుడైనా ఒంటరిగా కూచుని నా కవిత్వం మొత్తం చూసుకున్నప్పుడు ఇందులో ఇంత ఉదాసీనత ఎందుకుందా అని బెంగటిల్లుతాను’ అంటాడు 90 ఏళ్లకు సమీపిస్తున్న గుల్జార్. జీవితాన్ని, ప్రేమను, మానవీయ అనుబంధాలను, ప్రకృతి ప్రదర్శించే ఐంద్రజాలంలో పొందగల ఆనందాలను... ఊరటను, చిన్నచిన్న ఫిర్యాదులను, పెద్దపెద్ద సర్దుబాట్లను రాస్తూ వచ్చిన గుల్జార్ ఈ దేశపు వర్తమాన ముఖచిత్రాన్ని అనునిత్యం న్యూస్పేపర్లలో చూసి ఉదాసీనత చెందుతూనే ఉంటాడు. మరల మరల ప్రేమను పంచాల్సిన సంకల్పాన్ని పొందుతూనే ఉంటాడు. కత్తులు నిద్రలేచే రాత్రులు మరోమారు దేశంలో అరుదెంచకూడదని కలవరపడే గుల్జార్, పైజామా జేబులో బొంగరాన్ని దాచుకుని బుగ్గలపై కన్నీటి చారికలతో మిగిలిన మరో బాలుడి గాథ ఈ దేశం భవిష్యత్తులో వినరాదని దుఆ చేస్తాడు. హిందీని, ఉర్దూను కలిపి తాను మాట్లాడేభాషను ‘హిందూస్తానీ’గా పేర్కొనే గుల్జార్ తన పేరుకు తగ్గట్టు ఈ హిందూస్తాన్ ఒక పూలతోటై విరబూయాలని, సుగంధాలను వెదజల్లుతూనే ఉండాలని కలంతో సందేశాలను పంపుతూనే ఉంటాడు. -
ఆర్యవర్త, భరతవర్ష, ఇండియా.. ఈ పేర్లు ఎలా వచ్చాయి? ‘సిం’ని ‘హిం’ అని ఎవరన్నారు?
మన దేశాన్ని ఇండియా అని పిలవాలా లేక భారతదేశం అనాలా అనే విషయంపై అటు రాజకీయ పార్టీల మధ్య, ఇటు ప్రజల మధ్య సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. మన రాజ్యాంగంలో ‘ఇండియా దట్ ఈజ్ భారత్’ అని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, వివిధ క్రీడలు, ప్రపంచ వేదికలపై ఇండియా అనే పేరు ప్రబలంగా ఉంది. అయితే మన దేశాన్ని వివిధ కాలాల్లో పలు పేర్లతో సంబోధించేవారనే విషయం మీకు తెలుసా? వీటిలో జంబూద్వీపం, ఆర్యవర్త, భరతవర్ష, హింద్, హిందుస్థాన్ మొదలైనవి అత్యంత ప్రాచుర్యం పొందిన పేర్లు. ఈ పేర్లు ఎప్పుడు వచ్చాయి? ఈ పేర్ల వెనుక ఉన్న అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్యవర్త ఆర్యులు మన దేశాన్ని స్థాపించారని చెబుతారు. ఆర్య అంటే ఉత్తమమైనది. ఈ ప్రాంతంలో ఆర్యుల నివాసం ఏర్పరుచుకున్న కారణంగా మన దేశానికి ఆర్యవర్త అని పేరు వచ్చింది. ఆర్యవర్త సరిహద్దులు కాబూల్‌లోని కుంభా నది నుండి భారతదేశంలోని గంగా నది వరకు, అలానే కశ్మీర్ మైదానాల నుండి నర్మదా నది ఆవలి వైపు వరకు విస్తరించి ఉన్నాయి. ఆర్యుల నివాసానికి సంబంధించి పలువురు చరిత్రకారులలో ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జంబూద్వీపం మన దేశాన్ని పూర్వకాలంలో జంబూద్వీపం అని కూడా పిలిచేవారు. భారతదేశంలో జామున్(నేరేడు) చెట్లు అధికంగా ఉండటం వల్ల దీనికి ఈ పేరు వచ్చిందని చాలా మంది చరిత్రకారులు భావిస్తున్నారు. అదేవిధంగా జంబూ చెట్టు.. ఏనుగంత పరిమాణంలో భారీ ఫలాలను ఇస్తుందనే నమ్మకాలు ఉన్నాయి. ఈ పండ్లు పర్వతం మీద పడినప్పుడు వాటి రసం నుండి నది ఏర్పడిందని చెబుతారు. ఈ నది ఒడ్డున ఉన్న భూమిని జంబూద్వీపం అని పిలవసాగారు. భరతవర్ష మన భూభాగం పేరు ఎంతో ప్రజాదరణ పొందింది. మహారాజు దుష్యంతుడు, శకుంతల దంపతుల కుమారుడైన భరతుని పేరు మీదుగా దేశానికి భారత్ అనే పేరు వచ్చిందని చెబుతారు. అదేవిధంగా గురువు రిషభదేవుడు తన రాజ్యాన్ని తన కొడుకు భరతునికి అప్పగించాడని, అందుకే మన దేశానికి భరతవర్ష అని పేరు వచ్చిందని అంటారు. దశరథుని కుమారుడు, శ్రీరాముని సోదరుడు భరతుని ప్రస్తావన కూడా ఇదేవిధంగా కనిపిస్తుంది. అలాగే నాట్యశాస్త్రంలో కూడా భరతముని ప్రస్తావన ఉంది. దేశానికి ఆయన పేరు పెట్టారని కూడా అంటారు. పురాణాలలో కూడా భారతదేశ సరిహద్దులు సముద్రానికి ఉత్తరం నుండి హిమాలయాల దక్షిణం వరకు విస్తరించి ఉన్నాయని పేర్కొన్నారు. హిందుస్థాన్ పురాతన కాలంలో భారతదేశంలోని సింధు లోయ నాగరికత ఇరాన్, ఈజిప్ట్‌తో వాణిజ్య సంబంధాన్ని కలిగి ఉంది. ఇరానియన్లో ‘సిం’ని ‘హిం’ అని సంబోధించారట. ఫలితంగా సింధు కాస్తా హిందూగా మారిందని అంటారు. తరువాతి కాలంలో ఈ భూమి హింద్ పేరుతో ప్రసిద్ధి చెంది, చివరికి హిందువులుంటున్న ప్రదేశం కనుక హిందుస్థాన్ అయ్యిందని చెబుతారు. భారతదేశం మన దేశానికి ఈ పేరు బ్రిటిష్ వారు పెట్టారని అంటారు. బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు, వారు సింధు లోయను తొలుత ఇండస్ వ్యాలీ అని పిలిచేవారు. దీనితో పాటు భారత్ లేదా హిందుస్థాన్ అనే పదానికి బదులుగా ఇండియా అనే పదాన్ని ఉపయోగించసాగారు. అది వారికి పలికేందుకు చాలా సులభంగా అనిపించిందట. చాలామంది ఇండియా అనేది బ్రిటిష్ యుగానికి చిహ్నమని, అందుకే ఈ పేరులో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తుంటారు. ఇది కూడా చదవండి: దేశంలో అతిపెద్ద జిల్లా ఏది? -
దేశ భద్రతకు‘పంచ’ కవచాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటి వరకు షిప్ రిపేర్ హబ్‌గా మాత్రమే కొనసాగుతున్న విశాఖపట్నం హిందూస్థాన్ షిప్‌యార్డ్.. త్వరలోనే షిప్ బిల్డింగ్ హబ్‌గా అత్యుత్తమ సేవలందించేందుకు అడుగులు ముందుకు వేస్తున్నది. దేశీయ నౌకల తయారీపై దృష్టి సారించిన షిప్‌యార్డ్ అందుకోసం భారత నౌకాదళంతో కీలక ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ క్రమంలో రూ.19,048 కోట్లతో 5 భారీ యుద్ధ నౌకల నిర్మాణ పనుల్ని దక్కించుకుంది. దేశ చరిత్రలో ఏ షిప్‌యార్డ్ నిర్మించని విధంగా ఏకంగా 44 వేల టన్నుల షిప్స్‌ని నిర్మించనున్న హెచ్ఎస్ఎల్... 2027 ఆగస్ట్‌లో తొలి యుద్ధనౌకని ఇండియన్ నేవీకి అప్పగించనుంది. యుద్ధ విన్యాసాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించేలా షిప్ డిజైన్లతో పాటు.. రక్షణ వ్యవస్థలోనే కాకుండా.. విపత్తు నిర్వహణకు వినియోగించేలా షిప్‌లను తయారు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. సింధుకీర్తి సబ్‌మెరైన్ మరమ్మతుల విషయంలో హిందుస్థాన్ షిప్‌యార్డ్ అపవాదు మూటకట్టుకుని.. తొమ్మిదేళ్లకు పూర్తి చేయడంతో షిప్యార్డ్డ్ పనైపోయిందని అంతా అనుకున్నారు. అయితే, ఐఎన్ఎస్ సింధువీర్ మరమ్మతుల్ని అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసి ఆ మరకని తుడిచేసుకున్న షిప్‌యార్డ్.. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఎలాంటి నౌకలు, సబ్మెరైన్ల మరమ్మతులైనా రికార్డు సమయంలో పూర్తి చేస్తూ.. ఆయా సంస్థలకు అప్పగిస్తున్న హెచ్ఎస్ఎల్.. ఇప్పుడు ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. ఐదేళ్ల కాలంలో ఏకంగా 14 ప్రాజెక్టుల్ని పూర్తి చేసి ఆర్డర్ల పెండెన్సీ గణనీయంగా తగ్గించుకుంది. 40 నౌకల రీఫిట్ పనుల్ని ఐదేళ్ల కాలంలో పూర్తి చేసి ఔరా అనిపించుకుంది. మొత్తంగా హిందుస్థాన్ షిప్‌యార్డ్ పనితీరుతో విశాఖ.. షిప్ బిల్డింగ్ కేంద్రంగా మారుతోంది. రూ.19 వేల కోట్లు.. 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్స్.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,038 కోట్ల టర్నోవర్ సాధించిన షిప్‌యార్డ్ .. ఈ ఏడాది ఏకంగా రూ.19,048 కోట్ల పనులకు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేసింది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి సన్నద్ధమవుతోంది. ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ (ఎఫ్ఎస్ఎస్)ను భారత నౌకాదళం, కోస్ట్‌గార్డు కోసం తయారు చేసేందుకు శుక్రవారం భారత రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది.హైవాల్యూస్‌తో ఈ నౌకల నిర్మాణాలు చేపట్టనుంది. దేశంలోని ఏ షిప్‌యార్డ్‌లోనూ లేనివిధంగా ఏకంగా 44 మిలియన్ టన్నుల డిస్ప్లేస్మెంట్ సామర్థ్యమున్న నౌకల్ని తయారు చేయనుంది. ఈ నౌకల నిర్మాణాలతో 2023–24 నుంచి హెచ్ఎస్ఎల్ వార్షిక టర్నోవర్ గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం రూ.1,038 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న íషిప్‌యార్డ్ .. వచ్చే ఐదేళ్లలో రూ.1,500 నుంచి 2 వేల కోట్ల రూపాయలకు చేరుకోనుంది. 8 సంవత్సరాల కాల పరిమితితో ఈ షిప్స్‌ని తయారు చేయనుంది. తొలి షిప్‌ని 2027 ఆగస్ట్ 24న భారత నౌకాదళానికి అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకుంది. మూడేళ్లలో మరింత అభివృద్ధి.. పెరుగుతున్న ఒప్పందాలకు అనుగుణంగా.. షిప్‌యార్డ్‌ను ఆధునికీకరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రూ.1,000 కోట్లతో యార్డుని రానున్న మూడేళ్లలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం స్లిప్‌వేలు 190 మీటర్లుండగా వీటిని 230 మీటర్లకు పెంచనున్నారు. ఆర్డర్లు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్య కూడా పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా మరమ్మతులు, నౌకా నిర్మాణాలకు అనుగుణంగా రూ.5 వేల కోట్లతో మెటీరియల్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన 364 వెండార్ బేస్డ్ ఎంఎస్ఎంఈల సహకారం తీసుకుంటున్నారు. లక్షల మందికి ఉపాధి టెండర్లు దక్కించుకోవడంలో దూకుడు పెంచాం. తాజాగా 50 టన్స్ బొలార్డ్ పుల్ టగ్ బాల్‌రాజ్ మరమ్మతులు పూర్తి చేసి నేవల్ డాక్‌యార్డు (విశాఖపట్నం)కు అందించాం. అందుకే.. ఆర్డర్లు కూడా పెద్ద ఎత్తున సొంతం చేసుకుంటున్నాం. రక్షణ మంత్రిత్వ శాఖతో కుదుర్చుకున్న ఒప్పందం.. షిప్‌యార్డ్ భవిష్యత్తుని మార్చబోతోంది. ఈ ఎంవోయూ ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. విశాఖ భవిష్యత్తు కూడా మారబోతుంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా.. మేక్ ఇన్ ఇండియాని చాటిచెప్పేలా షిప్స్ తయారు చేస్తాం. దేశీయ నౌకల నిర్మాణంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలపైనా దృష్టి సారించాం. సబ్మెరైన్ల నిర్మాణం, రీఫిట్‌కు సంబంధించిన సామర్థ్యం, మౌలిక సదుపాయాల కల్పనతో మరింత ఆధునికీకరించుకునేందుకు రష్యాతోనూ సమగ్ర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. – కమోడోర్ హేమంత్ ఖత్రి, హిందుస్థాన్ షిప్‌యార్డు సీఎండీ -
గాంధీల దేశాన్ని గాడ్సే దేశంగా మారుస్తున్నారు: మెహబూబా ముఫ్తీ
న్యూఢిల్లీ: పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాలకులు గాంధీల దేశాన్ని గాడ్సే దేశంగా మారుస్తున్నారని మండిపడ్డారు. గాడ్సే కశ్మీర్‌ను కూడా తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆమె శనివారం అజెండా ఆజ్‌తక్ చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన తండ్రి మెహబూబా ముఫ్తీ సయ్యద్ సీఎంగా ఉన్న సమయంలో కశ్మీరీ పండిట్లకు సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. రాజ్యాంగ చట్టానికి వ్యతిరేకంగా 2019లో ఆర్టికల్ 370ని రద్దుచేసి, కొత్త కశ్మీర్‌ను నిర్మించామని బీజేపీ పాలకులు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతి కూతురు తన తండ్రి మృతదేహం ఎక్కడని అడుగుతోంది. ఓ చెల్లి తన అన్న మృతదేహం కోసం ఎందురు చూస్తోందని అన్నారు. ఈ పరిస్థతులను ప్రశ్నించినవారిపైనే నిందలువేస్తూ విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఇన్ని జరుగుతున్నా.. పాలకులు మాత్రం ప్రతీసారీ కొత్త కశ్మీర్ అంటూ మాట్లాడుతారని.. కొత్త హిందూస్తాన్ గురించి ఎందుకు మాట్లాడరని సూటిగా ప్రశ్నించారు. ఆర్టికల్ 370 అంటే బయటి వ్యక్తులు భూమిని కొనుగోలు చేయలేరని తెలిపారు. ఉద్యోగాలు స్థానికులకే కేటాయిస్తారని, ఇటువంటి నిబంధనలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని చెప్పారు. ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన కాదని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసిందని మెహబూబా ముఫ్తీ గుర్తుచేశారు. -
హిందుస్తాన్ అనను: ఎంఐఎం ఎమ్మెల్యే
పట్నా: ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే ఒకరు ‘హిందుస్తాన్’ అననంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాన్ని రేపారు. వివరాలు.. బిహార్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్తారుల్ ఇమాన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ.. ‘దానిలో భారత్ అనే ఉంది కదా.. హిందుస్తాన్ అని ప్రమాణం చేయడం సరైందేనా అని తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నారు. ‘రాజ్యంగా ప్రకారం ప్రమాణ స్వీకారం చేసే ప్రతిసారి భారత్ అనే ఉపయోగిస్తాం. ఈ క్రమంలో నేను హిందుస్తాన్ అని ఉపయోగించడం సరైందేనా.. లేక భారత్ అనే ఉపయోగించాలా. ఎందుకంటే మేం ప్రజాప్రతినిధులం. రాజ్యాంగం మాకు అన్నింటి కంటే ఎక్కువ’ అన్నారు. రిపోర్టర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘హిందుస్తాన్ అనే పదం పట్ల నేను ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. చేయను కూడా. రాజ్యాంగ ప్రవేశికను ఏ భాషలో చదివినా అందులో ఉండేది భారత్ అనే. దీని ప్రకారం రాజ్యాంగం పేరిట మన ప్రమాణం చేస్తున్నందున దానిలో ఉన్న దాన్ని ఉపయోగించడమే సరైన పని’ అన్నారు ఇమాన్. (మమతతో దోస్తీకి ఒవైసీ రెడీ) హిందుస్తాన్ అనడం ఇష్టం లేకపోతే పాక్ వెళ్లండి: బీజేపీ ఇక ఇమాన్ వ్యాఖ్యల పట్ల బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నాయకుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘హిందుస్తాన్ అని పలకాలంటే ఇబ్బంది పడేవారు పాకిస్తాన్ వెళ్లవచ్చు’ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమాన్‌తో సహా మరో నలుగురు ఎంఐఎం నాయకులు విజయం సాధించారు. -
‘ఇండియా’ కాదు.. భారత్!
న్యూఢిల్లీ: రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా అన్న పేరు స్థానంలో భారత్ లేదా హిందుస్తాన్ అన్న పదం వాడేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జూన్ 2వ తేదీన విచారించనుంది. ఈ పేరు మార్పు వల్ల మన జాతీయతపై గర్వంగా అనుభూతి చెందవచ్చునని, పరాయిపాలనను పౌరులు మరిచిపోయేలా చేస్తుందని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. పేరు మార్పునకు సంబంధించి కేంద్రం రాజ్యాంగంలోని ఒకటో ఆర్టికల్‌లో మార్పులు చేయాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే అందుబాటులో లేకపోవడంతో విచారణ జూన్ 2వ తేదీకి వాయిదా పడింది. -
వాటర్ బాటిల్ తీసుకురా!
సాక్షి, హైదరాబాద్: ఓ వాటర్ బాటిల్ కంపెనీ కేసుపై సీరియస్‌గా వాదనలు జరుగుతున్నాయి. ఇంతలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ తనకొచ్చిన సందేహ నివృత్తికి వాదనలను ఆపారు. తన సిబ్బందిలోని ఓ వ్యక్తిని పిలిచి, జేబులో నుంచి డబ్బు తీసి హైకోర్టు క్యాంటీన్లో వాటర్ బాటిల్ తీసుకురమ్మని ఆదేశించారు. వెంటనే ఆ వ్యక్తి క్యాంటీన్‌కు వెళ్లి వాటర్ బాటిల్ తెచ్చారు. దాన్ని పరిశీలించిన సీజే తన సందేహాన్ని నివృత్తి చేసుకున్నారు. ఈ ఆసక్తికర ఘటన సోమవారం హైకోర్టులో చోటు చేసుకుంది. ఆ తర్వాత వాటర్ బాటిళ్లపై సరఫరాదారు చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ తదితర వివరాలను పొందుపరచని కంపెనీలను నియంత్రించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు రెండు రోజుల గడువునిచ్చారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఎవరికి ఫిర్యాదు చేయాలి? హిందుస్తాన్ కోకాకోలా బేవరేజస్ ప్రైవేట్ లిమిటెడ్ మెదక్ జిల్లా, పాశమైలారంలోని హిమజల్ బేవరేజస్ ప్రైవేట్ లిమిటెడ్ ‘కిన్లే’బ్రాండ్ కింద తాగునీరు సరఫరా చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 2న తూనికలు, కొలతల శాఖ అధికారులు హిమజల బేవరేజస్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ సరఫరాకు సిద్ధంగా ఉన్న బాటిళ్లపై ఫిర్యాదు ఇవ్వాల్సిన వ్యక్తి పేరు, చిరునామా లేదంటూ దాదాపు లక్ష బాటిళ్లను అధికారులు జప్తు చేశారు. దీనిని సవాల్ చేస్తూ హిమజల్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ ముందు అప్పీల్‌కు అవకాశం ఉండటంతో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో హిమజల్ కంపెనీ కంట్రోలర్ ముందు అప్పీల్ దాఖలు చేసింది. విచారణ జరిపిన కంట్రోలర్ వాటర్ బాటిళ్ల జప్తును సమర్థించారు. దీనిపై కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు అధికారుల తీరును తప్పుపట్టారు. ఆ బాటిళ్లపై కేవలం వ్యక్తి పేరు లేదన్న కారణంతో జప్తు చేయడం సరికాదని పేర్కొన్నారు. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ బి.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తూనికలు, కొలతల శాఖ తరఫు న్యాయవాది జ్యోతికిరణ్ వాదనలు వినిపిస్తూ, నిబంధనల మేరకే తాము హిమజల్ కంపెనీలో ఉన్న వాటర్ బాటిళ్లను జప్తు చేశామన్నారు. వాదనలు వింటున్న సీజే తన డబ్బులతో హైకోర్టు క్యాంటీన్లో బిస్లరీ వాటర్ బాటిల్ తెప్పించుకుని పరిశీలించారు. ‘ఈ బాటిల్‌పై ఓ టోల్‌ఫ్రీ నంబరే ఉంది. అంతకు మించిన వివరాలు లేవు. ఈ బాటిళ్లలోని నీటిని కొందరు మినరల్ వాటర్ అంటున్నారు. వాస్తవానికి అవి ప్యాకేజ్డ్ వాటర్’ అని ఈ సందర్భంగా సీజే వ్యాఖ్యానించారు. -
హిందుస్థాన్ ఎలా వచ్చిందో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ శనివారం ఇండోర్‌లో మాట్లాడుతూ జర్మనీ దేశం ఎవరిదని ప్రశ్నించారు. ప్రజల నుంచి సమాధానం కోసం ఎదురు చూడకుండానే జర్మన్లది జర్మనీ దేశమని, బ్రిటిషర్లది బ్రిటన్ దేశమని, అమెరికన్లది అమెరికా దేశమని, అలాగే హిందువులది హిందుస్థాన్ అని చెప్పారు. ఒకింత గర్వం ఉట్టిపడేలా మాట్లాడారు. ఆయనొక్కరే కాదు, సంఘ్ పరివార్ నుంచి వచ్చిన వారంతా అలాగే మాట్లాడుతారు. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారత దేశాన్ని ఉద్దేశించి హిందుస్థాన్ అని సంబోధించారు. అందుకు ఆయనపై కేసును కూడా దాఖలయింది. ఇదంతా హిందుస్థాన్ అనే పదం ఎలా వచ్చిందో తెలియకపోవడమే. అది కనీసం భారతీయుల భాషల నుంచి వచ్చిన పదం కూడా కాదనే విషయం తెలుసో, తెలియదో!. హిందుస్థాన్ అనే పదం సింధుస్థాన్ అనే సంస్కృత పదం నుంచి వచ్చిందని హిందుత్వ వ్యవస్థాపకుడు వినయ్ సావర్కర్ చెప్పారు. సంస్కృతంలో ఎస్ పదాన్ని భారతీయ భాషల్లో హెచ్‌గా ఉచ్ఛరిస్తారు గనుక ఆయన సూత్రీకరణను కొంత వరకు అంగీకరించవచ్చు. వాస్తవానికి సింధూ నది తీరం వెంట నివసించేవారిని సింధువులుగా పిలిచేవారని చరిత్ర చెబుతోంది. వ్యవహారికంలో సింధువుకాస్త, హిందువుగా మారిపోయింది. దీనికి పర్షియన్ స్థాన్ వచ్చి చేరడంతో హిందుస్థాన్ అయింది. మొట్టమొదట భారత్‌ను హిందుస్థాన్ అని పిలిచింది కూడా పర్షియన్లే. పర్షియన్లో స్థాన్ అంటే ల్యాండ్ అని అర్థం. పర్షియన్ల కారణంగానే హిందుస్థాన్‌తోపాటు, పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, కజకిస్థాన్ దేశాలకు పేర్లు వచ్చాయి. 18వ శతాబ్దంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి యాత్ర చేసిన ప్రముఖ ట్రావెలర్ దర్గా ఖులీ ఖాన్ తన యాత్రా విశేషాలను వివరిస్తూ పర్షియన్లో రాసిన పుస్తకానికి కూడా ‘డెక్కన్ టు హిందుస్థాన్’ అని పేరు పెట్టారు. సింధూ నది చైనాలోని పశ్చిమ టిబెట్ ప్రాంతంలో పుట్టి భారత్‌లోని కశ్మీర్ మీదుగా పాకిస్థాన్‌లోకి ప్రవహిస్తోంది. ఈ నదీ తీరాన నివసించిన వారంతా హిందువులే అయితే పశ్చిమ టిబెటిన్లు, పాకిస్థానీయులు కూడా హిందువులే కావాలి. పర్షియన్లతోపాటు బ్రిటీష్ పాలకులు కూడా దేశంలోని ఉత్తరాది ప్రాంతాలను హిందుస్థాన్‌గా వ్యవహరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దేశం పేరును హిందుస్థాన్‌గా మార్చాలని హిందుత్వ శక్తులు గట్టిగానే వాదించాయి. అయితే దేశ వ్యవస్థాపక నాయకులు అందుకు అంగీకరించకపోవడంతో భారత దేశంగా మిగిలిపోయింది. ఇప్పటికీ హిందూత్వ శక్తులు మైకు దొరికినప్పుడల్లా హిందుస్థాన్ డిమాండ్‌ను తీసుకొస్తున్నాయి. జర్మన్ల నుంచి జర్మనీ దేశం వచ్చిందంటూ తప్పుడు సూత్రీకరణ ను కూడా తెరపైకి తెస్తారు. జర్మన్లు తమ దేశాన్ని మొదటి నుంచి డాచ్‌లాండ్ అని పిలుచుకునేవాళ్లు. వారి దేశాన్ని జర్మనీగా వ్యవహరించిందీ బ్రిటీషర్లే. ఆ మాటకొస్తే నెదర్లాండ్‌ను హోలండ్‌గా వ్యవహరిస్తారు. భారత్‌ను హిందుస్థాన్‌గా పిలిచినంత మాత్రాన హిందువులకే ఈ దేశం మీద సర్వహక్కులు సిద్ధిస్థాయా? అమెరికన్లది అమెరికా దేశమని కూడా మన మోహన్ భగవత్ అన్నారు. అది ఒక వలసల దేశమని, సకల దేశాల ప్రజలు అక్కడ ఉంటున్నారన్న విషయం ఆయనకు తెలియదా! -
అసోం గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు!
గువాహటి: హిందుస్థాన్ హిందువుల దేశమని, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజెన్స్ (ఎన్సీఆర్) ఆధునీకరణలో ఒక్క బంగ్లాదేశీ పేరు కూడా నమోదుచేయకుండా చూడాలని అసోం గవర్నర్ పీబీ ఆచార్య పేర్కొన్నారు. ఓ పుస్తకం విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్సీఆర్ ఆధునీకరణలో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చిన శరణార్థులకు భారత్‌లో ఆశ్రయం కల్పించేందుకు కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీచేయడంపై వివాదం తలెత్తగా.. ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు భారత్‌లో ఆశ్రయం పొందవచ్చునని, ఇతర దేశాల్లోని హిందువుల్లో భారత్‌లో ఆశ్రయం పొందడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన పేర్కొన్నారు. 'హిందుస్థాన్ హిందువుల దేశం. ఈ విషయంలో ఏ సందేహాలకు తావు లేదు. వివిధ దేశాల్లోని హిందువులంతా ఇక్కడ నివసించవచ్చు. ఇందుకు భయపడాల్సిన అవసరం లేదు. అయితే, వారికి ఎలా ఆశ్రయం కల్పించాలన్నదే పెద్ద ప్రశ్న. దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరముంది' అని ఆయన పేర్కొన్నారు. -
రజ్వీ.. లాతూర్ ప్రకంపన
హైదరాబాద్ స్టేట్ శతాబ్దాలుగా మత సామరస్యానికి చిరునామాగా నిలిచింది. పాలకులు ఢిల్లీ సుల్తానులకు ఆ తర్వాత బ్రిటిష్ వారికి నమ్మకస్తులుగా మారారు. స్వతంత్ర రాజ్యానికి ఉండాల్సిన అన్ని హంగులూ ఉన్నా, ప్రజల రక్షణ భాధ్యతలను ‘పై’వారికి అప్పగించారు. వారి వారసుడు ఏడో నిజాం. కిషన్ ప్రసాద్, అక్బర్ యార్జంగ్ వంటి సామరస్య వ్యక్తిత్వాలు లేని లోటు ఆయన అధికారానికి చరమగీతం పాడింది. మత భావనలు తీవ్రంగా వీచాయి. అధికారం అనే దీపం ఆరకూడదని నిజాం విఫలయత్నాలు చేశాడు! ఈ క్రమంలో కాశిం రజ్వీ కథ! ‘మజ్లిస్-ఎ-ఇత్తెహాద్-ఉల్ ముసల్మీన్’ అధ్యక్షుడు బహదూర్ యార్జంగ్ 1946లో అకస్మికంగా మరణించిన వైనం (Legends and Anecdotes of Hyderabad ) గురించి చెప్పుకున్నాం కదా! ఆయనోసారి హైదరాబాద్ స్టేట్‌లోని లాతూర్ (ప్రస్తుతం మహారాష్ట్ర) వెళ్లారు. పార్టీ కార్యాలయం కోసం తగిన వసతి చూడమని పార్టీ సభ్యులను కోరారు. ఒక వ్యక్తి తన ఇంటిని పార్టీ కార్యాలయానికి ఇస్తాన న్నాడు. క్షణాల్లో ఇంట్లోని సామాన్లను వీధుల్లోకి విసిరేశాడు. అధ్యక్షుడు హృదయానికి హత్తుకున్న ఆ కార్యకర్త సయ్యద్ కాశిం రజ్వీ ! బహదూర్ యార్జంగ్ మరణానంతరం సహజంగానే పార్టీ అధ్యక్షుడయ్యాడు. హైదరాబాద్‌కు ‘ప్రకంపనలను’ పరిచయం చేశాడు. ఖడ్గంతోనే ముస్లింలు హిందుస్థాన్‌కు పాలకులయ్యారన్నాడు. ఆయన ఉపన్యాసాలు కొందరిని ఉద్వేగపరచాయి. సామరస్య జీవనాన్ని కోరుకునే అధిక సంఖ్యాకులైన ముస్లింలకు ఆందోళన కలిగించాయి. స్వతంత్ర రాజ్యంగా అవతరించబోతోన్న బ్రిటిష్ పాలిత భారత్‌లో కలవకుండా, నిజాం స్వతంత్ర రాజుగా ఉండాలని రజ్వీ ఆయనలో రాజ్యకాంక్షను రగిలించాడు. ‘మై హూ నా’ అన్నాడు. ఎర్రకోటపై నిజాం జెండా రెపరెపలాడుతుందని, బెంగాల్ సముద్రజలాలు ఆయన పాద ప్రక్షాళన చేస్తాయని అభివర్ణించాడు. ప్రధానమంత్రిని తరిమారు! ‘నైజాం రాజ్య రక్షణ’ కోసం రజాకార్స్ అనే పేరుతో పారా మిలటరీ దళాన్ని ఏర్పరచాడు రజ్వీ! నాయకుని కోసం ప్రాణత్యాగం చేస్తామని, హైదరాబాద్ స్టేట్ విలీనం కాకుండా చివరి క్షణం వరకూ పోరాడుతామని సభ్యులతో ప్రమాణం చేయించాడు. ఫీల్డ్ మార్షల్ దుస్తుల్లో ఉండేవాడు. హోదాలను బట్టి ఇతరులు తుపాకులు, కత్తులు, కర్రలు చేతబట్టేవారు. ఏడాదిపాటు ‘యథాతథ స్థితి’ని గౌరవించేందుకు ఒప్పందానికి రావాలని 1947లో కేంద్ర ప్రభుత్వం, నిజాం ప్రభుత్వమూ భావించాయి. ఢిల్లీకి బయలుదేరిన నిజాం ప్రతినిధి బృందాన్ని రజాకార్లు అడ్డుకున్నారు. హైదరాబాద్ స్టేట్ ప్రధానమంత్రిపై చేయి చేసుకున్నారు! సౌమ్యుడైన ప్రధానమంత్రి సర్ మీర్జా ఇస్మాయిల్ స్టేట్ వదిలే వరకూ రజ్వీ మనుషులు తరిమారు. ఈ నేపథ్యంలోనే, నిజాం అధికార కాంక్షను నిరసిస్తూ, హైదరాబాద్ స్టేట్ భారత్‌లో అంతర్భాగం కావడం అనివార్యమని వార్తలు రాసిన షోయబుల్లాఖాన్ హత్యకు గురయ్యాడు. నిజాం ప్రధానమంత్రిగా నియమించిన నవాబ్ చట్టారీ స్థానంలో నిజాం నిర్ణయాన్ని పరిహసిస్తూ మీర్ లాయక్ అలీని ప్రధానమంత్రిగా రజ్వీ నియమించాడు. 1948 నాటి ఈ పరిస్థితుల్లో అధికసంఖ్యాకులు వలసపోయారు. అల్పసంఖ్యాకులు వలసవచ్చారు. పోలీస్ చర్యకు ‘రజ్వీ’ ఆహ్వానం! నిజాం నవాబుకు వత్తాసుగా ఎన్నో డాంబికాలు పలికిన రజ్వీ, హైదరాబాద్ స్టేట్ ఇండియాలో విలీనం కావాలని భావించిన షోయబుల్లాఖాన్ మరణానికి కారకుడైన రజ్వీ, పోలీస్ చర్యను ఆహ్వానించిన వారిలో ముందు వరుసలో ఉన్నాడు! 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో పేరుతో పోలీసు చర్య ప్రారంభమైంది (17 పోలో గ్రౌండ్స్‌తో హైదరాబాద్ ఇండియాలో నంబర్ 1 స్థానంలో ఉండేది!). నాలుగు రోజుల్లోనే నిజాం బేషరతుగా లొంగిపోయాడు. అనుయాయులతో రజ్వీ అరెస్టయ్యాడు. హిందు-ముస్లిం-క్రిస్టియన్ న్యాయమూర్తుల స్పెషల్ ట్రిబ్యునల్ రజ్వీ బృందంపై విచారణను ప్రారంభించింది. లా చదివిన రజ్వీ తన కేసును తానే వాదించుకున్నాడు. 1950 సెప్టెంబర్ 10న ట్రిబ్యునల్ విధించిన ఏడేళ్ల జైలుశిక్షను హైదరాబాద్, పూణెలలో పూర్తిచేసుకున్నాడు. ‘వా’హెద్! పూణెలోని ఎరవాడ జైలు నుంచి విడుదలైన రజ్వీని ఆయన అనుయాయి, న్యాయవాది కమిల్ అడిక్‌మెట్‌లో ఉన్న తన నివాసానికి కారులో తీసుకువచ్చాడు. పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు! 140 మందికి ఆహ్వానాలు వెళ్లగా 40 మంది వచ్చారు. ‘పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించే సాహసి లేరా’ అనే రజ్వీ పిలుపునకు స్పందన రాలేదు. 12 ఏళ్లు దాటిన ఏ పురుషుడైనా అధ్యక్షుడు కావచ్చని నిబంధన సవరించారు. అబ్దుల్ వాహెద్ ఒవైసీ అనే యువకుడు అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ దీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించారు. భారతీయ ముస్లింల యోగక్షేమాల పరిరక్షణ ధ్యేయమని పార్టీ ప్రకటించింది. ఆ మేరకు ముస్లిమేతరులనూ పార్టీ పదవులకు, ఉన్నత స్థానాలకు ఎంపిక చేస్తోంది. ఎంఐఎం పార్టీకి ప్రస్తుతం ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ అధ్యక్షుడు. మరో కుమారుడు అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ అసెంబ్లీలో శాసనసభాపక్షనేత. కన్నీరు కరవైంది! తాను దక్కన్లో పుట్టాను దక్కన్‌లోనే మరణిస్తానని గతంలో చెప్పుకున్న రజ్వీ, పార్టీ అప్పగింతలు పూర్తయిన తర్వాత తనకు భారత్‌లో భవిష్యత్ లేదని, పాకిస్థాన్ వెళ్తానని ప్రకటించాడు. పోలీస్ చర్య పూర్తయిన తొమ్మిదేళ్లకు సెప్టెంబర్ 18న పాకిస్థాన్ పయనమయ్యాడు. కమిల్ ముంబై వరకూ వెళ్లి సెండాఫ్ పలికారు. రజ్వీని పాకిస్థాన్‌లో ఎవ్వరూ రిసీవ్ చేసుకోలేదు. మద్దతు పలకలేదు. గుర్తించలేదు. ఇండియా నుంచి, ముఖ్యంగా దక్కన్ నుంచి కరాచీకి వెళ్లి బాధలు పడుతున్న వారికి న్యాయవాదిగా సేవలు అందించాడు. 67వ ఏట 1970 జనవరి 15న కరాచీలో రజ్వీ చనిపోయాడు. హైదరాబాద్‌లో స్వతంత్ర ముస్లిం రాజ్యాన్ని స్థాపించాలని కలగన్న కాశిం రజ్వీ.. తాను పుట్టిన నేలకు సుదూరాన ఏర్పడ్డ మత రాజ్యం పాకిస్థాన్‌లో మరణించాడు. అక్కడ రజ్వీ కోసం ఏ ఒక్కరూ కన్నీరు పెట్టలేదు! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
ఇండియాలో దాగిన హిందుస్తాన్ ఆసక్తి రేపే పుస్తకం
తాజా పుస్తకం గతం నుంచి వర్తమానం, వర్తమానం నుంచి భవిష్యత్తు నిర్మితమవుతాయి. చరిత్ర కూడా ఇలాగే అడుగులు వేస్తూ వెళుతుంది. ఒక్కోసారి తప్పటడుగులు కూడా. అయితే తప్పటడుగులు వేసిన వారికి తమ తప్పిదాలు తెలియకపోవచ్చు. ముందు తరాల వారు వాటిని గుర్తిస్తారు. గాంధీలో ఉన్న హిందుత్వ భావనే దేశ విభజనకు కారణమైందని, ఆ తరువాత నెహ్రూ దాన్ని పెంచి పోషించాడని ఈ పుస్తక రచయిత పెరి అండర్సన్ అంటారు. పెరి అండర్సన్ ఆంగ్లో-ఐరిష్ రచయిత. ప్రముఖ మార్క్సిస్టు మేధావి. ఆయన గతంలో ‘ఇండియన్ ఐడియాలజీ’ పేరుతో ఇంగ్లిష్‌లో రాసిన పుస్తకమే ఇప్పుడు ‘ఇండియాలో దాగిన హిందుస్తాన్’ పేరుతో అనువాదమై వెలువడింది. ఈ పుస్తకంలోని అంశాలను మనం సమర్థించవచ్చు. లేదా విమర్శించవచ్చు. కాని చర్చించాల్సిన విషయాలు కొన్ని ఇలా ఉన్నాయి. ఇండియా అన్న భావనే యూరప్ నుంచి సంక్రమించింది. ఎందుకంటే అంతకు ముందు అది చిన్న చిన్న రాజ్యాల సమూహం. అందుకే బ్రిటిష్‌వాళ్లు సులభంగా జయించి ఒక్కటి చేశారు. లౌకికవాదాన్ని అనుసరించే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు గాంధీకి చేతికి వచ్చిన తరువాత పురాణాలు, మత ధర్మశాస్త్రాలను చొప్పించి ఆయనకు తెలియకుండానే హిందుత్వని అమలు చేశారు. గాంధీ పట్ల ముస్లింల అపనమ్మకానికి ఇది బీజం వేసింది. మున్ముందు ఇది దేశవిభజనకు దారి తీసింది. 1922లో చౌరీచౌరాలో పోలీసులపై హింస జరిగినందుకు నిరసనగా దేశవ్యాప్త ఉద్యమాన్ని నిలుపుదల చేయించిన గాంధీ, రెండవ ప్రపంచ యుద్ధాన్ని సమర్థించడమే కాకుండా సైన్యంలో చేరమని కూడా పిలుపునిచ్చారు. ఆయన అహింసాయుధంపై ఆయనకే స్పష్టత లేదు. అంటరానివాళ్లకు ప్రత్యేక నియోజకవర్గాలను మంజూరు చేస్తూ బ్రిటిష్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా గాంధీ చేశారు. నిస్సహాయ స్థితిలో అంబేద్కర్ కూడా గాంధీకి లొంగిపోయారు. ఈ విషయమై చనిపోయేవరకూ అంబేద్కర్ బాధ పడుతూనే ఉన్నారు. నెహ్రూకి గాఢమైన మత విశ్వాసాలు లేకపోయినా అనేక అంశాల్లో గాంధీ హిందుత్వనే ఆయన అనుసరించాడు. కాశ్మీర్ విషయంలో నెహ్రూ చేసిన తప్పిదాల వల్లే ఈనాటికీ రక్తం ఏరులై పారుతోంది. వ్యక్తిగత ఇష్టాయిష్టాలను రాజకీయాలకు ముడిపెట్టే అలవాటు నెహ్రూకి ఉంది. బహిరంగ సభలో నాగాలాండ్ ప్రజలు తనకి పిరుదులు చూపించి అవమానించారనే కోపంతో ఆయన నాగాలాండ్‌పై కర్కశంగా ప్రవర్తించారు. (‘గాంధీ అనంతర భారతదేశం’ పుస్తకంలో రామచంద్ర గుహ కూడా ఇదే చెబుతారు) మతతత్వం వల్ల లబ్ది చేకూరుతుందనుకుంటే బిజెపి, కాంగ్రెస్‌లు ఒకేలా వ్యవహరిస్తాయి. 2002లో గుజరాత్లో చనిపోయిన వారి కంటే 1984లో ఢిల్లీలో జరిగిన ఊచకోతలో చనిపోయిన వాళ్ల సంఖ్యే ఎక్కువ.రాజకీయాలపై ఆసక్తి ఉన్న వాళ్లందరూ చదవాల్సిన పుస్తకమిది. - జి.ఆర్.మహర్షి ఇండియాలో దాగిన హిందుస్తాన్- పెరి అండర్సన్; హెచ్.బి.టి ప్రచురణ; వెల: రూ.150; ప్రతులకు: 040- 23521849 -
పడకేసిన ప్రభుత్వ షేర్లు
ముంబై: స్టాక్ మార్కెట్లో ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల షేర్లు కుదేలవుతున్నాయి. మార్కెట్లో పరిస్థితులతో సంబంధం లేకుండా కేంద్రం పలు పీఎస్‌యూల్లో వాటాలను విక్రయిస్తుండటం... దీనికితోడు వాటివద్దనున్న మిగులు నిధులను ఎలాగైనా ఖజానాకు తరలించే పనిలోపడటం వంటివి ఇన్వెస్టర్లలో గుబులు రేపుతున్నాయి. దీంతో ఈ స్టాక్‌ను ఎడాపెడా అమ్మేసి వదిలించుకుంటున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో మొత్తం లిస్టెడ్ పీఎస్‌యూల మార్కెట్ విలువలో సుమారు రూ.3.9 లక్షల కోట్లు ఆవిరికావడం దీనికి నిదర్శనం. బ్యాంకింగ్, చమురు-గ్యాస్, మెటల్స్ క్రాష్... కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని, ప్రమోట్ చేసిన కంపెనీలకు సంబంధించినవే పీఎస్‌యూ లిస్టెడ్ స్టాక్స్‌లో అత్యధికంగా ఉన్నాయి. ఇటీవలి స్టాక్స్‌క్రాష్‌లో కూడా 98 శాతం ఇవే కావడం గమనార్హం. ముఖ్యంగా బ్యాంకింగ్, చమురు-గ్యాస్, మెటల్, మైనింగ్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు గత కొన్నాళ్లుగా తుక్కుతుక్కు అవుతున్నాయి. మొండిబకాయిల భయంతో పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు కుదేలవుతున్నాయి. ప్రభుత్వ అనుమతుల్లో జాప్యం, స్కామ్‌ల ప్రభావంతో మెటల్, మైనింగ్ స్టాక్స్ ఆవిరయ్యేందుకు దారితీస్తోంది. ఈ రెండునెలల్లో సెన్సెక్స్ 5.5 శాతం, నిఫ్టీ 7.5 శాతం మేర క్షీణించాయి. దీనికికూడా పీఎస్‌యూ షేర్ల పతనమే ప్రధాన కారణం. జూలై ఆరంభంనుంచి మార్కెట్లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ క్షీణతలో 90% పీఎస్యూలదే కావడం వీటి పతనం ఎలా తీవ్రంగా ఉందనేందుకు నిదర్శనం. కాగా, పీఎస్‌యూల షేర్ల పతనంలో అత్యధికంగా నష్టపోతున్నది ప్రభుత్వమే. జూన్ చివరినాటికి మొత్తం 73 లిస్టెడ్ కేంద్ర పీఎస్‌యూల్లో ప్రభుత్వానికి సగటున 72.3% వాటా ఉంది. ప్రభుత్వ స్వయంకృతాపరాధమే...! పీఎస్‌యూ షేర్లు ఇంత ఘోరంగా కుప్పకూలుతుండటానికి ప్రభుత్వం చేపడుతున్న డిజిన్వెస్ట్‌మెంటే కారణమని విశ్లేషకులు తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఎలాగైనా నిధులను సమీకరించాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఒకపక్క, వాటా అమ్మే పీఎస్‌యూల షేరు ధరలు సగానికిపైగా పడిపోయినా... దీనికంటే తక్కువ ధరకే కేంద్రం వాటాను విక్రయిస్తుండటం మొత్తం పీఎస్‌యూ స్టాక్స్‌పై ప్రభావం చూపుతోందని వారు అంటున్నారు. హిందుస్థాన్ కాపర్ ఇష్యూ ధరతో పోలిస్తే(రూ.160) ఇప్పుడు 63% పైగానే కరిగిపోయి రూ.57కు కుప్పకూలింది. ఇక ఎంఎంటీసీ ఇష్యూకు రెండు నెలల ముందు రూ.300 స్థాయి నుంచి వాటా విక్రయ సమయానికి రూ.70కి పడిపోయింది. అయినాసరే ప్రభుత్వం రూ.60 ధరకు వాటా విక్రయించింది. ఇప్పుడు ఈ షేరు రూ.45కు జారిపోయింది. మిగులు నిధులతో పుష్టిగాఉన్న కంపెనీల నుంచి డివిడెండ్లు ఇతరత్రా మార్గాల్లో సొమ్మును ప్రభుత్వం ఖజానాకు తరలించొచ్చనే భయాలూ పీఎస్‌యూ షేర్లలో అమ్మకానికి పురిగొల్పుతున్నాయని నిపుణులు అంటున్నారు. తాజాగా పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో వాటా విక్రయానికి ఆ కంపెనీ బోర్డు ఆమోదించడంతో ఆ షేరు ఒక్కరోజే 15 శాతంపైగా కుప్పకూలింది. మరోపక్క, భెల్ షేరూ అదేపనిగా పడుతూవస్తోంది. మూడు రోజుల క్రితం 20 శాతం క్షీణించింది. నెల రోజుల క్రితం రూ.180 స్థాయి నుంచి అడుగంటిపోయింది. .