న్యూఢిల్లీ: రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా అన్న పేరు స్థానంలో భారత్ లేదా హిందుస్తాన్ అన్న పదం వాడేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జూన్ 2వ తేదీన విచారించనుంది. ఈ పేరు మార్పు వల్ల మన జాతీయతపై గర్వంగా అనుభూతి చెందవచ్చునని, పరాయిపాలనను పౌరులు మరిచిపోయేలా చేస్తుందని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. పేరు మార్పునకు సంబంధించి కేంద్రం రాజ్యాంగంలోని ఒకటో ఆర్టికల్‌లో మార్పులు చేయాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే అందుబాటులో లేకపోవడంతో విచారణ జూన్ 2వ తేదీకి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment