
గచ్చిబౌలిలో విషాదం.. చంపాడా.. చనిపోయిందా?
అయితే, అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతోపాటు ఆమె నుదుటిపై బలమైన గాయాలు ఉండటంతో భర్తే హత్య చేసి ఆత్మహత్యలా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నాడంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. గతకొద్ది రోజులుగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, వారి మధ్య కొంత కాలంగా సఖ్యత లోపించి తరచు గొడవలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆమె భర్త నర్సింహను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.