'టీఆర్ఎస్లోనే కొనసాగుతా' | i will continue in TRS, says Manda Jagannadham | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్లోనే కొనసాగుతా'

Published Mon, Mar 31 2014 3:44 PM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM

'టీఆర్ఎస్లోనే కొనసాగుతా'

'టీఆర్ఎస్లోనే కొనసాగుతా'

తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని ఎంపీ మందా జగన్నాథం సోమవారం న్యూఢిల్లీలో స్పష్టం చేశారు. ఆ పార్టీ తరఫున ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించానని తెలిపారు. టీఆర్ఎస్తోనే దళితులకు న్యాయం జరుగుందని తాను ముమ్మాటికి నమ్ముతున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎన్ని త్యాగాలు చేసిన ఆ పార్టీ అధిష్టానం గుర్తించలేదన్నారు.

టీఆర్ఎస్ నుంచి ఎంపీ వివేక్ ఈ రోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వివేక్ పార్టీ మారినట్లు మీరు ఏమైనా కాంగ్రెస్లో చేరుతారా అన్న విలేకర్ల ప్రశ్నకు మందా జగన్నాథంపై విధంగా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి ఎంపీ వివేక్ కొద్ది కాలం క్రితం టీఆర్ఎస్లో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇటీవల  తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. దాంతో వివేక్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి... ఈ రోజు  న్యూఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement