ఫేస్బుక్లో కామెంట్స్, కలెక్టర్కు తాఖీదు | IAS officer gets notice for FaceBook post on Modi | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్లో కామెంట్స్, కలెక్టర్కు తాఖీదు

Published Tue, May 31 2016 8:41 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

ఫేస్బుక్లో కామెంట్స్, కలెక్టర్కు తాఖీదు - Sakshi

ఫేస్బుక్లో కామెంట్స్, కలెక్టర్కు తాఖీదు

భోపాల్: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఫేస్బుక్ లో వ్యాఖ్యలు చేసినందుకు మధ్యప్రదేశ్ లో ఐఏఎస్ అధికారి ఒకరు తాఖీదు అందుకున్నారు. ఫేస్బుక్ లో చేసిన కామెంట్లపై వివరణ ఇవ్వాలని ఐఏఎస్ అధికారి అజయ్ గంగ్వార్ ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోరింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతకుముందే ఆయనపై చర్య తీసుకుంది. బర్వానీలో కలెక్టర్ గా విధులు నిర్వరించిన ఆయనను అక్కడి నుంచి సెక్రటేరియట్ కు బదిలీ చేసింది.

మోదీని విమర్శిస్తూ, జవహర్ లాల్ నెహ్రును పొగుడుతూ ఆయన ఫేస్ బుక్ లో కామెంట్స్ చేశారు. దీంతో మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఆయనపై కన్నెర్ర జేసింది. కాగా, గంగ్వార్ ను వివరణ కోరడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుబట్టింది. భావప్రకటన స్వేచ్ఛను బీజేపీ హరిస్తోందని విమర్శించింది. అజయ్ సింగ్ ను తిరిగి బర్వానీ కలెక్టర్ గా తిరిగి నియమించాలని డిమాండ్ చేసిం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement