తండ్రీ కొడుకులిద్దరూ ఒకే సభలో ఎమ్మెల్సీలుగా చేసిన ఘటన మన రాష్ట్రంలో చూశాం. కానీ తండ్రీ కొడుకులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులుగా ఒకే రాష్ట్రంలో పనిచేయడాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇలా తొలిసారి జరిగింది. ఇక్బాల్ సింగ్ బైన్స్ 1985 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం డిప్యూటేషన్పై ఢిల్లీలో పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు అమన్వీర్ సింగ్కు కూడా తాజాగా మధ్యప్రదేశ్ కేడర్ కేటాయించారు.
ఐఐటీ రూర్కీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన అమన్వీర్.. యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ పరీక్షలలో 45వ ర్యాంకు సాధించారు. ఆయనకు కూడా మధ్యప్రదేశ్ కేడరే కేటాయించడంతో తండ్రీ కొడుకులిద్దరూ ఒకే రాష్ట్రంలో ఒకేసారి ఐఏఎస్ అధికారులుగా పనిచేసే అరుదైన అవకాశం లభించింది. ఇంతకుముందు కూడా తండ్రీకొడుకులు ఐఏఎస్ అధికారులుగా పనిచేసినా, తండ్రి పదవీ విరమణ చేసిన తర్వాతే కొడుకులు సర్వీసులోకి రావడం జరిగింది. అమన్వీర్ ఒక్కరు మాత్రం తన తండ్రి సర్వీసులో ఉండగానే ఐఏఎస్గా చేరారు.
కొసమెరుపు: మన రాష్ట్ర కేడర్లో మాత్రం ఇప్పటికే తల్లీ కొడుకులు ఒకేసారి ఐఏఎస్ అధికారులుగా పనిచేస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ లక్ష్మీపార్థసారథి భాస్కర్ 1980 బ్యాచ్కి చెందిన అధికారిణి. ఆమె కుమారుడు కృష్ణభాస్కర్ 2012 బ్యాచ్ అధికారి. ఇద్దరిదీ ఏపీ కేడరే.