డిప్రెషన్తో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య | IIT Bombay Student Found Dead in Campus. Case of Suicide, Say Sources | Sakshi
Sakshi News home page

డిప్రెషన్తో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

Published Sun, May 3 2015 4:48 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

డిప్రెషన్తో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య - Sakshi

డిప్రెషన్తో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

ప్రఖ్యాత బాంబే ఐఐటీ క్యాంపస్లో కెమికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థి జితేశ్ శర్మ (21) అనుమానాస్సద రీతిలో మరణించాడు. శనివారం రాత్రి హాస్టల్ టెర్రస్పై జితేశ్ మృతదేహాన్ని గుర్తించిన సహవిదర్యార్థు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీ చేయగా పాయిజన్ బాటిల్తోపాటు మృతుడు రాసిన సూసైడ్ నోట్ లభించాయి. 

 

గత కొంత కాలంగా డిప్రెషన్తో బాధపడుతోన్న జితేశ్ ఆ మేరకు చికిత్స కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది. సరిగా చదవడంలేదని, గత నెలలో రాసిన పరీక్షల్లో ఫెయిల్ అవుతానని, క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగం పొందలేననే భయాందోళనతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు జితేశ్ సూసైడ్ నోట్లో రాశాడని పోలీసులు చెప్పారు. పోస్ట్మార్టం అనంతరం జితేశ్ మృతదేహాన్ని స్వస్థలం రోహ్తక్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement