
సాక్షి న్యూఢిల్లీ : దేశంలోని 13 రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. నేడు, రేపు పలు రాష్ట్రాల్లో వందలాది పిడుగులపడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఢిల్లీ, జమ్ము కశ్మీర్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తారాఖండ్‌లతో పాటు ఈశాన్య రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మరోవైపు భారీ పిడుగుల పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నేడు, రేపు, ప్రభుత్వ-ప్రవేటు పాఠశాలు, కళాశాలలు మూసివేయాలని హరియాణ విద్యాశాఖా మంత్రి ఆదేశించారు.