నడి రోడ్డుపై అంత జరిగినా ఎవరూ ఆగలేదు​ | In Shocking Video, Burning Man Didn't Stop Traffic | Sakshi
Sakshi News home page

నడి రోడ్డుపై అంత జరిగినా ఎవరూ ఆగలేదు​

Published Fri, May 12 2017 12:32 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

నడి రోడ్డుపై అంత జరిగినా ఎవరూ ఆగలేదు​ - Sakshi

నడి రోడ్డుపై అంత జరిగినా ఎవరూ ఆగలేదు​

బీడ్‌(మహారాష్ట్ర): ఓ మనిషి నిలువునా తగులబడిపోతున్నా మానవత్వం బయటకు రాలేదు. రోడ్డున పోయే ఏ ఒక్కరు కనికరించలేదు. ఒక్క వాహనం కూడా అసలు ఏం జరుగుతుందా అని పరిశీలించే ప్రయత్నం చేయలేదు. అక్కడికి చేరిన నలుగురైదుగురు కూడా ఏం చక్కా తమ ఫోన్‌లకు పని పెట్టే వీడియోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఈ మనసు చివుక్కుమనే సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలోని ఓ రహదారిపై రెండు బైకులు ఢీకొన్నాయి.

ఈ క్రమంలో అవతలి బైక్‌ వ్యక్తి గాయపడగా మరో బైక్‌పై ఉన్న వ్యక్తి మాత్రం ఆ బైకుకిందే చిక్కుకుపోయాడు. ఈ లోగా అనూహ్యంగా బైక్‌కు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో అది కాస్త బడబాగ్నిలా చుట్టుముట్టి నడిరోడ్డుపైనే చితిమాదిరిగా మారిపోయింది. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే ఆ రోడ్డుపై వెళ్లే ఏ ఒక్కరూ స్పందించిన ఈ వ్యక్తి కూడా గాయాలతో బయటపడే అవకాశం ఉండేది.

కానీ, అలా జరగకపోవడంతో కళ్లముందే సజీవంగా ఓ వ్యక్తి తన బైక్‌తో సహా తగులబడిపోయి భస్మంగా మారాల్సి వచ్చింది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో మానవతావాదులంతా కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ బహుశా ఈ బైకుల్లో ఎవరో ఒకరు మద్యం తీసుకొని వెళుతుండొచ్చని, ఢీకొట్టడం కారణంగా అది మండి ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement