సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా పాజిటివ్ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 3,967 పాజిటివ్ కేసులతో పాటు, వైరస్ సోకి 100 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 81,970కి చేరుకోగా, ఇప్పటి వరకు 2,649 మంది మృత్యువాత పడ్డారు. ఇక వైరస్ నుంచి కోలుకుని ఇప్పటివరకు 27,920 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం భారత్‌లో 51,401 యాక్టివ్ కేసులు కేసులు ఉన్నాయి. (విదేశాల నుంచి రాకతో పెరిగిన కరోనా)
మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక కేరళలోనూ కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ తాజాగా మరో 26 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడం, వలస కూలీల తరలింపు, విదేశాల నుంచి స్వదేశానికి ప్రయాణికులను తరలించడం మూలంగానే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. (కరోనా మృతులు 3 లక్షలు)
Comments
Please login to add a commentAdd a comment