ఇండియాటుడే ఎగ్జిట్ పోల్
ముంబై: మంగళవారం బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ)కు జరిగిన ఎన్నికల్లో శివసేన అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఆ ఎగ్జిట్ పోల్ ప్రకారం శివసేన 86–92 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. ఇక బీజేపీకి 80–88 స్థానాలు దక్కవచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్ 30–34 స్థానాలకు పరిమితమవుతుందని, ఎన్సీపీకి కేవలం 3–6 స్థానాలు వస్తాయని ఇండియాటుడే పోల్‌లో వెల్లడైంది. ఎంఎన్‌ఎస్‌కు 5–7 స్థానాలు, ఇతరులకు 2–7 సీట్లు రావచ్చని తేలింది. ఓట్ల శాతం విషయానికొస్తే... శివసేన, బీజేపీలు చెరి 32 శాతం ఓట్లు దక్కించుకుంటాయి.
కాంగ్రెస్‌కు 16 శాతం, ఎన్సీపీకి 4 శాతం, ఎంఎన్‌ఎస్‌కు 8 శాతం ఓట్లు పడతాయని అంచనా వేశారు. ఎస్పీకి 3 శాతం, ఇతరులకు 5 శాతం ఓట్లు దక్కవచ్చని ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో దాదాపు 55 శాతం పోలింగ్ నమోదైంది. బీఎంసీతో పాటు మహారాష్ట్రలోని 10 పురపాలక సంస్థలకు కూడా ఎన్నికలు జరగ్గా 56 శాతం ఓటింగ్ నమోదైంది. అలాగే 11 జిల్లా పరిషత్‌లకు, 118 పంచాయతీ సమితిలకు కూడా పోలింగ్ నిర్వహించారు. వీటికి 69 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
బృహన్ ముంబైలో ‘సేన’దే ఆధిక్యం
Published Wed, Feb 22 2017 1:18 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement