మోడీ ప్రధానైతే దేశం కాలి బూడిదవుతుంది: మమతా
కోల్ కతా: బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. మోడీ ప్రధానైతే భారతదేశం కాలి బూడిదవుతుందని మమతా బెనర్జీ అన్నారు.
అంతేకాకుండా భారత దేశ ప్రగతి ఎన్నో ఏళ్లు వెనక్కి వెళ్లుతుందని మమతా వ్యాఖ్యలు చేశారు. విభజన రాజకీయాలు చేసే వ్యక్తికి దేశాన్ని పాలించే హక్కులేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికే ప్రధానైపోయాననే భ్రమలో మోడీ ఉన్నారని మమతా ఎద్దేవా చేశారు. మోడీ టైగర్ కాదని ఆమె అన్నారు.
దేశంలో అసలైన టైగర్లు మయావతి, జయలలిత, ములాయం సింగ్ యాదవ్ అని అన్నారు. అసలైన రాయల్ బెంగాల్ టైగర్ బెంగాల్ లోనే ఉందని మమతా అన్నారు. మత ఘర్షణల ఆరోపణలు ఎదుర్కొంటున్న మోడీకి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారత్ దేశాన్ని పాలించే అర్హత లేదని మమతా బెనర్జీ విమర్శించారు.