బెంగాలీల జోలికొస్తే అంతే... | Will Never, Ever Have an Alliance with BJP, says Mamata Banerjee | Sakshi
Sakshi News home page

బెంగాలీల జోలికొస్తే అంతే...

Published Mon, May 5 2014 1:33 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

బెంగాలీల జోలికొస్తే అంతే... - Sakshi

బెంగాలీల జోలికొస్తే అంతే...

రనాఘాట్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై మరోసారి నిప్పులు చెరిగారు. పశ్చిమ బెంగాల్లో ఉంటున్న ఏ ఒక్కరినైనా దేశ బహిష్కరణ చేస్తే, ఢిల్లీని అట్టుడికిస్తామని హెచ్చరించారు. ‘ఏ ఒక్కరినైనా టచ్ చేసి చూడండి. అప్పుడు నేను ఢిల్లీని వణికిస్తా’ అని ఆమె మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి విభజన రాజకీయాలకు పాల్పడుతూ, ఈ ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారమిక్కడ జరిగిన ఎన్నికల సభలో మమత ప్రసంగించారు.

 

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను భారత్‌లోకి అనుమతించారని, ఇలాంటి వారిని వెనక్కి పంపిస్తామని మోడీ చేసిన వ్యాఖ్యలపై మమత పైవిధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement