'గుజరాత్ ప్రజలంటేనే ప్రేమ.. నమో అంటే ఇష్టం లేదు'
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి నిప్పులు చెరిగారు. బీజేపీ మతతత్వ పార్టీ అని దీదీ విమర్శల్ని ఎక్కుపెట్టింది. గుజరాత్ ప్రజలను ప్రేమిస్తాను కాని.. నమో అంటే తనకు ఇష్టం లేదు అని మమతా అన్నారు.
నదియా జిల్లాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మమతా మాట్లాడుతూ.. మోడీని ఎందుకు విమర్శించడం లేదని అందరూ ప్రశ్నిస్తున్నారని.. అయితే తాను ప్రతి ఒక్కరిని ఎందుకు ప్రశ్నించాలి? నేను పార్టీల విధానాన్నే ప్రశ్నిస్తాను అని అన్నారు.
గుజరాత్ లో అభివృద్ది జరిగిందంటూ మోడీ చేస్తున్న ప్రచారాన్ని ఆమె తప్పుపట్టారు. గుజరాత్ లో మత ఘర్షణలు జరుగాయని.. పశ్చిమ బెంగాల్ లో అలాంటి సంఘటనలు ఉన్నాయా అని అన్నారు.