పీఎంగా ఉన్నా విచారణకు రెడీ: మోడీ
* అవినీతి ఆరోపణలొస్తే దర్యాప్తునెదుర్కొంటా: మోడీ
* మమత సహకారంపై ఆశాభావం..
* ములాయంపై విసుర్లు
న్యూఢిల్లీ: అధికారంలోకి వస్తే పాత కేసుల పరిశీలనకు ముందు భవిష్యత్తులో అవినీతిని నిరోధించేందుకే తాను అధిక ప్రాధాన్యతను ఇస్తానని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చెప్పారు. ప్రధానమంత్రి హోదాలో తనపై అభియోగాలు వచ్చినా దర్యాప్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటానని అన్నారు. ఎన్నికల్లో ఓటమినైనా ఎదుర్కొంటాను కానీ విభజన రాజకీయూలను మాత్రం అవలంబించబోనని స్పష్టం చేశారు.
అవినీతి ఓ వ్యాధి వంటిదని శుక్రవారం ఓ టీవీ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో గుజరాత్ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా తగు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయూల్సిందిగా తన ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరుతుందని వెల్లడించారు. ఓట్లు వేయూల్సిందిగా తాను ప్రత్యేకంగా ఏ వర్గానికీ విజ్ఞప్తి చేయబోనని మోడీ స్పష్టం చేశారు. దేశంలోని మొత్తం 125 కోట్ల మందికి విజ్ఞప్తి చేస్తానన్నారు. ‘అది నచ్చితే ఓకే. ఒకవేళ నచ్చకపోతే ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమే. అందరూ ఒకటేనన్నది నా మంత్రం..’ అని పేర్కొన్నారు.
లౌకికవాదం పేరుతో సోదరుల మధ్య విభజనను తాను అంగీకరించబోనన్నారు. మీరు పోటీ చేస్తున్న వారణాసిలో గెలిపించాల్సిందిగా అక్కడి ముస్లింలకు విజ్ఞప్తి చేస్తారా? అన్న ప్రశ్నకు మోడీ పై విధంగా స్పందించారు. సోనియూగాంధీ ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు ఎవర్ని కలిసినా తమకు అభ్యంతరం లేదని, అది ప్రజాస్వామ్యంలో భాగం.. కానీ ఎవరికి ఓటు వేయూలో ప్రత్యేకంగా ఓ మతం వారికి చెప్పడం సమంజసం కాదని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే గెలిచిన అభ్యర్థుల అఫిడవిట్లను సుప్రీం కోర్టుకు అందజేసి.. వారిపై ఉన్న కేసులను వేగవంతం చేయూల్సిందిగా కోరుతుందని చెప్పారు.
మమత సహకరిస్తారని ఆశిస్తున్నా: తాను అధికారంలోకి వస్తే పశ్చిమబెంగాల్‌లో సింగూరు సమస్య పరిష్కారంతో పాటు పారిశ్రామికీకరణకు అవసరమైన సానుకూల వాతావరణం ఏర్పాటుకు మమతా బెనర్జీ ప్రభుత్వం సహకరిస్తుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించినంత వరకు తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయూలకు పాల్పడదని నమ్ముతున్నట్టు బెంగాలీ దినపత్రిక ఆనందబజార్ పత్రికకు ఆయన చెప్పారు. ఇలావుండగా ఉత్తరప్రదేశ్‌లోని ఓ సభలో ప్రసంగించిన మోడీ ఎస్పీ అధినేత ములాయంసింగ్ యూదవ్‌పై విమర్శలు గుప్పించారు. రేపిస్టుల విషయంలో కఠిన వైఖరి అవలంబించడంలో ములాయం విఫలమయ్యూరన్నారు.