న్యూఢిల్లీ: భారత సైన్యం దేశాన్ని కాపాడటానికి సరిహద్దుల్లో చేస్తున్న పోరాటాలను.. బిహార్ రెజిమెంట్‌లోని సైనికుల దైర్యానికి, శౌర్యానికి నమస్కరిస్తూ చేసిన ఓ వీడియోను ఇండియన్ ఆర్మీ ట్విటర్ ద్వారా పంచుకుంది. అందులో 'వారు పోరాడటానికి జన్మించారు. అలా అని గబ్బిలాలు కాదు. బ్యాట్‌మాన్. ప్రతి సోమవారం తర్వాత మంగళవారం ఉంటుంది. బజరంగ్ బలి కి జై' అంటూ వ్యాఖ్యానిస్తూ.. నార్తరన్ కమాండ్ ఇండియన్ ఆర్మీ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఇండో–చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య గత సోమవారం రాత్రి జరిగిన హింసాత్మక ఘర్షణల్లో రెండు దేశాలకు భారీగా ప్రాణ నష్టం జరిగింది. బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబుతో సహా ఇరవై మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
కాగా.. గల్వాన్ వ్యాలీ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రోజున బిహార్ ప్రజలతో మాట్లాడుతూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులకు నేను నివాళులర్పిస్తున్నాను. యుద్ధంలో ధైర్య, సాహసాలతో పోరాడిన సైనికులను భారతదేశం స్మరించుకుంటోందని తెలిపారు. బిహార్ రెజిమెంట్ సైనికులు అన్నింటినీ సవాల్ చేస్తూ విభిన్న పరిస్థితుల్లోనూ ధైర్యంగా పోరాడారని భారత సైన్యం ప్రశంసించింది. ఈ వీడియోలో 21 సంవత్సరాల క్రితం కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన వారిని కూడా గుర్తుచేసింది. కాగా అప్పట్లో బిహార్ రెజిమెంట్ కార్గిల్ చొరబాటుదారులకు ధీటైన సమాధానం చెప్పింది. 1941లో స్థాపించబడిన ఈ రెజిమెంట్ భారతదేశపు పురాతన కంటోన్మెంట్. దీనిని మూలాలు బ్రిటీష్ ఇండియన్ ఆర్మీనాటి నుంచే ఉండటం గమనార్హం. చదవండి: గల్వాన్ వంతెన నిర్మాణం విజయవంతం
Comments
Please login to add a commentAdd a comment