సైనిక కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ: జమ్మూకశ్మీర్ పోషియాన్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జవాన్లపై కాల్పులకు తెగబడ్డ ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రత బలగాలు మట్టు బెట్టాయి. అంతకు ముందు ఉగ్రవాదుల జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. ఇక భారత సరిహద్దు ఎల్‌ఓసీ వెంబడి పాక్ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది.
పూంచ్ జిల్లాలోని భారత సైనిక స్థావరాలపై ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో పాక్ కాల్పులకు తెగబడింది. ఈ కాల్పులను జవాన్లు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. డిఫెన్స్ వర్గాల సమాచారం మేరకు ఈ కాల్పుల్లో ఓ భారత పౌరుడు, ఒక జవాను మృతి చెందినట్లు తెలుస్తోంది.