సాక్షి, ముంబై : నగరంలోని పలు బ్లడ్ బ్యాంక్‌లు పరిశుభ్రతను పాటించడం లేదు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అధికారులు ఆయా బ్లడ్ బ్యాంక్‌లను తనిఖీ చేసినప్పుడు ఇంకా పలు అంశాలు వారి దృష్టికి వచ్చాయి. సీఎస్టీలో ఉన్న కామా, ఆల్‌బ్లెస్ ఆస్పత్రులలోని బ్లడ్ బ్యాంక్‌లు అన్‌హైజెనిక్ పరిస్థితిలో ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ అధికారులు (బీటీఓ) కూడా అందుబాటులో లేరు. మే 15వ తేదీన ముగ్గురు సభ్యులు గల కమిటీ సభ్యులు ఈ బ్లడ్ బ్యాంక్‌లను పరిశీలించారు. వీరిలో కేం ఆస్పత్రి నిపుణులు కూడా ఉన్నారు.
ఈ బృందంతో పాటు ఎఫ్‌డీఏ, సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇన్‌స్పెక్టర్లు కూడా ఉన్నారు. ఈ బ్లడ్ బ్యాంకులు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ అధికారులు లేకుండానే కొనసాగుతున్నాయని గుర్తించారు. ఈ బ్లడ్ బ్యాంక్‌లను కమిటీ పర్యవేక్షించినప్పుడు గోడల నుంచి పేయింటింగ్ తొలగిపోయిందని, రిఫ్రిజిరేటర్ కూడా పాడైపోయిందని, ఏయిర్ కండీషనర్ కూడా పని చేయడం లేదని, బ్లడ్ బ్యాంక్ మొత్తంగా అపరిశుభ్రంగా ఉండడాన్ని ఈ బృందం గమనించింది.
సూచన :
బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ అధికారుల పర్యవేక్షణలో బ్లడ్ సేకరణ, నిల్వ జరగాలని, వీరికి ఎఫ్‌డీఏ అధికారులు ఆమోదం తెలపాలని ఎఫ్‌డీఏ జాయింట్ కమిషనర్ ఎస్.కె.పాటిల్ తెలిపారు. ఇంకా పలు అంశాలను బ్లడ్ బ్యాంక్‌లకు సూచించారు. జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డీన్ డాక్టర్ టి.పి.లహానే మాట్లాడుతూ.. తమ వద్ద ముగ్గురు బీటీవోలు ఉన్నారని, ఇద్దరు సెలవులపై వెళ్లారని తెలిపారు. ఒక్క అధికారి కూడా కుటుంబ సమస్యల వల్ల అందుబాటులోలేరని తెలిపారు.
బ్లడ్‌బ్యాంకుల్లో అపరిశుభ్రత
Published Sun, Jul 6 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM
Advertisement
Advertisement