Insanitary
-
మంచం పట్టిన సఫావత్ తండా
సాక్షి, తిరుమలగిరి (నాగార్జునసాగర్) : అపరిశుభ్రతో... కలుషిత తాగునీరో... కారణమేదో కానీ ఆ తండాను జ్వరం మహమ్మారి పట్టిపీడిస్తోంది. వైరల్ ఫివతో తండా వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. జబ్బు చేసిందని హాస్పిటల్‌కు వెళితే మందు గోళీలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లినా డబ్బులు ఖర్చవుతున్నాయే తప్ప రోగం మాత్రం నయం కావడం లేదంటూ తండా వాసులు వాపోతున్నారు. తండాలో ఇప్పటి వరకు 100 మందికి పైగా జ్వరంతో మంచం పట్టగా ఒక్కో కుటుంబానికి రూ. 20వేలకు పైగానే ఖర్చయిందని, అయినా జబ్బు నయం కావడం లేదంటున్నారు. ఇదీ తిరుమలగిరి మండలం సఫావత్ తండా పరిస్థితి. తండాలో 756 మంది జనాభా ఉన్నారు. ఈ తండాలో ఎక్కువగా రైతులు, కూలీలే ఉన్నారు. వీళ్లు బతుకుదెరువు కోసం చుట్టుపక్కల కూలి పనికి వెళ్తుంటారు. సుమారు ఇరవై రోజులుగా వీరి కుటుంబ సభ్యులకు జ్వరం వస్తుంది. దాంతో మిర్యాలగూడ, హాలియా వంటి పెద్దాసుపత్రులకు వెళ్లి లక్షలు ఖర్చు చేసినా జ్వరం మాత్రం నయం కావడం లేదంటున్నారు. రోజూ వచ్చే కూలి పోతుందని, ఉన్న డబ్బులు కూడా ఖర్చవుతున్నాయని బాధితులు ఆందోళన చెందుతున్నారు. అపరిశుభ్రతకు నిలయంగా.. మండలంలోని సఫావత్తండా అపరిశుభ్రతకు నిలయంగా మారింది. తండాలో డ్రెయినేజీలు లేకపోవడంతో ఇళ్లలోని మురుగునీరు మొత్తం రోడ్డుపైకి చేరి రోజుల కొద్దీ నీరు నిల్వ ఉంటుంది. అదే విధంగా తండాలో పెంటదిబ్బలు ఇళ్లమధ్యలోనే ఉండటం, తండాకు సరఫరా అయ్యే మంచినీటి ట్యాంకులను కూడా శుభ్రపరచకపోవడంతో అపరిశుభ్రతకు నిలయంగా మారింది. గిరిజన ప్రజలకు మరుగుదొడ్లపై అవగాహన కల్పించాల్సి ఉన్నా వారు మనకేంటిలే అని వ్యవహరిస్తుండటంతో తండాలో కనీసం 30 శాతం మేరకూడా మరుగుదొడ్లు లేవు. దాంతో మలమూత్రాలను రోడ్డువెంటనే విసర్జిస్తున్నారు. దీంతో తండా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అవగాహన కార్యక్రమాలేవీ..? పరిసరాల పరిశుభ్రత... రోగాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వ వైద్యఆరోగ్యí సిబ్బంది ఆ దిశగా అడుగులు మాత్రం వేయడం లేదు. ప్రజలకు రోగాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య సిబ్బందిపై ఉన్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతోనే ప్రజలు అవస్థలు పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ వైద్యం అందించాలి.. తండాలోని ప్రజలంతా జ్వరాలతో బాధపడుతున్నారు. అంతా కూలి పనులు చేసుకొని బతి కేటోళ్లమే. రోగం వస్తే చూపించుకునే స్థోమత కూడా మాకు లేదు. ప్రై వేట్ వైద్యం చేయించుకోవాలంటే అప్పు చేయాల్సి వస్తుంది. ప్రైవేట్ వైద్యం చేయించుకునే స్థోమతలేకపోవడం, ప్రభుత్వ వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. – సఫావత్ పాండు 20 వేలకు పైగా ఖర్చయింది.. పదిహేను రోజుల నుంచి జ్వరం వస్తుంది. హాలియా, మిర్యాలగూడలోని ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే ఇప్పటి వరకు రూ.20వేలకు పైగా ఖర్చయింది. అయినా రోగం తగ్గలే. చేతిలో ఉన్న పైసలు కూడా అయిపోవడంతో వైద్యం చేయించుకునే స్థోమత లేక ఇంటిబాట పట్టినం. ఉన్నతాధికారులు స్పందించి నాణ్యమైన వైద్యం అందించాలి. – సఫావత్ మంగి, సఫావత్తండా -
ఆసుపత్రి ఇలాగేనా..!
హుజూరాబాద్‌రూరల్: ‘ఆసుపత్రి ఇలాగే ఉంటుందా..? ఎటు చూసినా అపరిశుభ్రం.. మురికికూపాలుగా వార్డులు.. దుర్వాసన వస్తున్న మరుగుదొడ్లు.. ఇలాగైతే ఎలా..? విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు..’ అంటూ జిల్లా వైద్యాధికారి రామ్మనోహర్ రావు హెచ్చరించారు. ‘పేరుకే పెద్దాసుపత్రి’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ స్పందించారు. హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని పరిస్థితిని తెలుసుకుని నివేదిక అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి సూచించారు. ఈ మేరకు రామ్‌మనోహర్‌రావు ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని ప్రతివార్డులోని రోగుల వద్దకు వెళ్లి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పారిశుధ్యం లోపించడంతో సిబ్బందిని పిలిపించి తీవ్ర స్థాయిలో మందలించారు. మరుగుదొడ్లను సరిగ్గా శుభ్రం చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణలో పందులు స్వైరవిహారం చేయడాన్ని గమనించి.. వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పారిశుధ్యలోపంపై డిప్యూటీ డీఎంహెచ్‌వో రాజమౌళిని ప్రశ్నించారు. పర్యవేక్షణ ఇదేనా..? అంటూ మండిపడ్డారు. ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసిన రూ.5 లక్షలతో కాంటిజెంట్ వర్కర్లకు వేతనాలు ఇవ్వాలన్నారు. పారిశుధ్య సమస్య పునరావృతమైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓపీ (ఔట్‌పేషెంట్) రికార్డును పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరు వైద్యులు తప్పనిసరిగా ఓపీ చూడాలని సూచించారు. వైద్యులు ఎల్లప్పుడు రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. జమ్మికుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన బుర్ర సాత్విక రెండోకాన్పు చేయించుకోగా.. ఆడబిడ్డ జన్మించిందని, ఆ బిడ్డ తల్లిదండ్రులు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయమంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. శంకరటపట్నం మండలం ఆముదాలపల్లికి చెందిన రాధారపు నిఖిత గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా పరీక్షించారు. ప్రభుత్వ హాస్టల్లో ఆర్బీఎస్కే వైద్య బృందం పరీక్షలు జరిపారా..? అని ఆరా తీశారు. లేదనడంతో వెంటనే రాష్ట్రీయ బాల్ స్వస్త ఆరోగ్య కార్యక్రమం వైద్యుడికి ఫోన్ చేసి మాట్లాడాలని డిప్యూటీ డీఎంహెచ్‌వోను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని ప్రతిమ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణరావు, వైద్య సిబ్బంది ఉన్నారు. స్పందించిన సూపరింటెండెంట్ మరోవైపు సాక్షిలో వచ్చిన కథనానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణరావు స్పందించారు. సిబ్బందితో ఆసుపత్రి పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని తొలగించారు. మురికి నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో మట్టి పోయించారు. -
రాజన్న సన్నిధిలో అపరిశుభ్రత
సాక్షి, వేములవాడ : కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్న వేములవాడ రాజన్న గుడి వద్ద అపరిశుభ్రం రాజ్యమేలుతోంది. ఏటా లక్షలాది భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్న ఈ క్షేత్రంలో పారిశుధ్యం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, భక్తులు పడేసిన విస్తర్లు, చెత్త, ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తున్నాయి. రద్దీ సమయంలో ఇంకా చెత్త పెరిగిపోయి పారిశుధ్యం లోపించి దుర్వాసన వెదజల్లుతోందని భక్తులు మొత్తుకుంటున్నారు. చెత్త కుప్పలు.. మలినాలు రాజన్న ఆలయ ఆవరణతోపాటు క్యూలైన్ల వెంట చెత్తకుప్పలు, మలినాలు దర్శనమిస్తున్నాయి. ఇక క్యూలైన్లలోని మరుగుదొడ్ల వద్ద ముక్కులు మూసుకునే దుస్థితి నెలకొంది. ప్రధానాలయం ముందు భాగంలో చెత్త కుప్పలు అలాగే పడి ఉంటున్నాయి. రాజగోపురం వద్ద ప్లాస్టిక్ కవర్లు, చెత్త దర్శనమిస్తోంది. ధర్మగుండం వద్ద పారిశుధ్యం లోపించి దుర్వాసన వెదజల్లుతోంది. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా.. ఏటా పారిశుధ్యం నిర్వహణకు ఆలయం నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా భక్తులకు మాత్రం స్వచ్ఛమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో ఆలయ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతుందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
ఇది జాతీయ రహదారేనా?
పట్టించుకోని అధికారులు రోడ్డుగుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు వెళ్లినా మారని జోగిపేట రోడ్డు దుస్థితి జోగిపేట : జాతీయ రహదారి పక్కనే మురికినీరు నిలిచి బురదమయంగా మారినా పట్టించుకునే వారు కరవయ్యారు. నగర పంచాయతీగా ఉన్న జోగిపేటలో రోడ్డు ప్రక్కన అపరిశుభ్రత నెలకొనడం వల్ల పరిసర ప్రాంతాల్లోని వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ కమిటీ మొదటి గేటు పక్కనే అంతా బురదగా మారింది. ప్రతి ఆదివారం ఇక్కడ సంత జరుగుతుంది. అందోలు, పుల్కల్, రేగోడ్, అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, కౌడిపల్లి, హత్నూర మండలాల నుంచి రైతులు మార్కెట్‌కు వస్తుంటారు. జోగిపేట, సంగారెడ్డి నాందేడ్ రోడ్డుపై నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, జిల్లా అధికారులు రెగ్యులర్‌గా వెళుతున్నా ప్రధాన రహదారి పక్కనే నిల్వ ఉన్న మురికినీటిని పట్టించుకోకపోవడం గమనార్హం. తహసీలుదారు కార్యాలయం పక్కనే నీరు నిలిచి అపరిశుభ్రంగా మారింది. పక్కనే చెత్తకుండీ ఉండడం, మూత్ర విసర్జన కూడా అక్కడే చేయడంతో దుర్గంధం వస్తుంది. కార్యాలయానికి కలెక్టర్, జేసీ, ఆర్డీఓ, వంటి అధికారులు వస్తున్నా అటువైపు చూడడంలేదని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. జోగిపేట జాతీయ రహదారిపై ఎక్కడికక్కడే నీరు నిలవడం, బురదమయంగా మారి అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. నగర పంచాయతీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదు. పోస్టాఫీసు ముందు నుంచి ప్రతి రోజు వందలాది మంది విద్యార్థులు కాలినడకన పాఠశాలలు, కళాశాలలకు వెళుతుంటారు. ఒక్కసారి పెద్ద వర్షం పడితే కనీసం 10 రోజులకు పైగా నీరు అక్కడే నిలిచిపోతోంది. ద్విచక్రవాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. స్థానిక నర్సింగ్‌హోం ముందు గత రెండు సంవత్సరాలుగా రోడ్డుపై మురికి నీరు ప్రవహిస్తోంది ఈ రోడ్డుగుండా ఎంతో మంది కాలినడకన వెళతుంటారు. మురికినీరు రోడ్డుపై నిలవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డుపై ద్విచక్రవాహనంపై వెళితే అదుపుతప్పితే బురదలో పడే ప్రమాదం ఉంది. మురికి నీటిని తొలగించాలి జోగిపేటలోని ప్రధాన రహదారి పక్కనే నీరు నిల్వ ఉండటంతో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పోస్టాఫీసు ఎదుట వర్షాకాలం నీరు నిలిచిఉంటుంది. రోడ్డు పక్కన విద్యార్థులు వెళుతుంటే నీటిలో నుంచి వాహనాలు వెళ్లే సమయంలో ఆ నీరంతా వారి దుస్తులపై పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. నరేష్, ఏఐఎస్ఎఫ్ నాయకుడు మార్కెట్ గేట్ వద్ద బురదనీటిని తొలగించండి వ్యవసాయ మార్కెట్ గేట్ వద్ద నుంచి రోడ్డు మీదంతా మురికినీరు నిలవడంతో అంతా బురదమయంగా మారింది. మార్కెట్‌కు రైతులు వచ్చినప్పుడు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆరు బయట కూడా కొందరు వ్యాపారం చేసుకుంటారు. బురదనీటి వల్ల క్రిమి, కీటకాలు వస్తున్నాయి. గడ్డిపెరగడంతో దోమలు వస్తున్నాయి. రమేశ్, వైఎస్సార్సీపీ నాయకుడు -
ప్రభుత్వ ఆసుపత్రిలో పందికొక్కులు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల ఘటన మరవక ముందే.. అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళను పందికొక్కులు కరిచి గాయపరిచాయి. వివరాల్లోకి వెళితే.. వజ్రకరూరు మండలం పందికుంట గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ రెండు రోజుల క్రితం కాన్పు కోసం గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. అయితే లక్ష్మికి సహాయకురాలుగా వచ్చిన తల్లి ఎర్రమ్మ (55) ను ఆదివారం రాత్రి పందికొక్కు కరిచింది. ఉలిక్కిపడిన ఎర్రమ్మ నిద్ర నుంచి మేల్కొని చూస్తే.. వార్డులో పందికొక్కులు కనిపించాయి. గాయపడిన ఎర్రమ్మకు నర్సులు చికిత్స చేశారు. ఆస్పత్రిలో పరిశుభ్రత లోపించడం వల్ల పందికొక్కులు, ఎలుకలు ఎక్కువయ్యాయని.. ఆరోగ్యం కోసం ఆస్పత్రికి వస్తే.. ప్రాణాలే పోయే పరిస్థితి ఎదురైతోందని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రసవ వేదన
సాక్షి, ఒంగోలు: ప్రజారోగ్యం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నా..పేదవాడికి వైద్యం అందని ద్రాక్షగానే ఉంటోంది. జనాభా ప్రాతిపదికన ప్రతీ 10 వేల మందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉండాలి. కానీ జిల్లాలో ప్రతీ 15 వేల మందికి ఒకరు లేకపోవడం గమనార్హం. వైద్యారోగ్యశాఖకు కేంద్రప్రభుత్వం జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ ద్వారా నిధులు విడుదల చేస్తోంది. జిల్లాకు ఏటా రూ.20 కోట్లు అందుతున్నాయి. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం కోసం పంచాయతీకి రూ.10 వేలు చొప్పున 880 గ్రామాలకు రూ.88 లక్షలు ఖర్చుచేస్తున్నారు. ఎలాంటి ఫలితాలు ఉండటం లేదు. గ్రామాల్లో అపరిశుభ్రత, అంటువ్యాధులు, అనారోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధులు ఏటా ప్రబలుతూనే ఉన్నాయి. జననీ సురక్ష యోజన (జేఎస్వై), జననీ శిశుసంరక్ష కార్యక్రమం (జేఎస్ఎస్కే) కింద గర్భిణులకు కాన్పుల కోసం ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపిస్తున్నా.. ఇవి రికార్డులకే పరిమితమవుతున్నాయి. ఇక జిల్లాలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఆస్పత్రులు 37 ఉన్నాయి. వీటిపై ఏటా రూ.కోటి వరకు ఖర్చుచేస్తున్నా.. వీటిల్లో కాన్పులు చేసుకునే వారి సంఖ్య ఏటా తగ్గిపోతూనే ఉంది. గణాంకాలు చెబుతున్నదేమిటంటే.. జిల్లా జనాభా 33,92,764 మంది. ఇందులో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికంటే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం మంది ప్రజలుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 85 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 550 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. 85 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 280 మంది వైద్యులకు గాను ప్రస్తుతం 200 మందే ఉన్నారు. 804 గ్రామాల్లో వైద్యసేవలు అందుబాటులో లేవు. ఇక్కడ ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలే దిక్కు. ఉత్సవ విగ్రహాలే.. జిల్లాలో 37 కేంద్రాల్లో గర్భిణులకు ఆపరేషన్లు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవి 24 గంటలు సేవలందించాలి. ఇక్కడి కేంద్రాల్లో ఆపరేషన్లు జరగకపోయినా ఏటా కోట్లల్లో ఖర్చులు చూపిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) కింద ఈ ఏడాది రూ.30 కోట్లు రాగా, అధికారులు ఖర్చుచేసింది రూ.25 కోట్లు. వీటి ఖర్చుకు సంబంధించి పీహెచ్‌సీల నుంచి నివేదికలు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ మత్తువైద్యులు అందుబాటులో లేకపోవడం, సిబ్బంది కొరతతో ఆపరేషన్లు జరగడం లేదు. పరికరాలూ అందుబాటులో లేవు. తగ్గని మాతాశిశు మరణాలు మాతాశిశు మరణాలను పూర్తిస్థాయిలో తగ్గిం చేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వైద్యఆరోగ్యశాఖ నుంచి ప్రయత్నిస్తున్నాయి. 24 గంటల సీమాంక్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే, ప్రతీ గ్రామపరిధిలో అంగన్వాడీ ఆశవర్కర్తో పాటు ఏఎన్ఎంను నియమించారు. వీరు గ్రామీ ణ ప్రాంతాల్లో తిరిగి గర్భిణుల వివరాలను నమోదుచేసి.. వారికి కాన్పుచేసి ఇంటికి వెళ్లేంత వరకు బాధ్యత తీసుకోవాలి. దీనికోసం ఎన్ఆర్హెచ్ఎం కింద జేఎస్ఎస్కే (జననీ శిశుసంక్షణ కార్యక్రమం), జేఎస్వై (జననీ సురక్షయోజన) పథకాల రూపంలో రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా రు. జిల్లాలో మాతాశిశు మరణాల రేటు మాత్రం తగ్గడం లేదు. 2013-14 సంవత్సరంలో మాతృమరణాలు 127, శిశుమరణాలు 39 సంభవించాయి. గడచిన తొమ్మిది నెలల కాలంలో రెండూ కలిపి సుమారు 200 పైగానే ఉంటాయని వైద్యవర్గాలు పేర్కొనడం గమనార్హం. ప్రైవేటు వైపు ఎందుకు...? ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకు రూ.7 వేల నుంచి రూ.10 వేలు తీసుకుంటుండగా, సిజేరియన్లకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు గుంజుతున్నారు. అయినా ఎక్కువగా ప్రసవాలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. దీనికితోడు ఆర్ఎంపీలు ఒక్క కేసును గ్రామం నుంచి పంపితే రోగి ఇచ్చే ఫీజులో 40 శాతం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లమని సూచిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇందుకు ఒక్కో కేసుకు కొంతమొత్తంలో ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో అనుమతుల్లేని ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తున్నా.. వైద్యారోగ్యశాఖ పట్టీపట్టనట్లు వ్యవహరించడం దురదృష్టకరం. -
బ్లడ్‌బ్యాంకుల్లో అపరిశుభ్రత
సాక్షి, ముంబై : నగరంలోని పలు బ్లడ్ బ్యాంక్‌లు పరిశుభ్రతను పాటించడం లేదు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అధికారులు ఆయా బ్లడ్ బ్యాంక్‌లను తనిఖీ చేసినప్పుడు ఇంకా పలు అంశాలు వారి దృష్టికి వచ్చాయి. సీఎస్టీలో ఉన్న కామా, ఆల్బ్లెస్ ఆస్పత్రులలోని బ్లడ్ బ్యాంక్‌లు అన్హైజెనిక్ పరిస్థితిలో ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అధికారులు (బీటీఓ) కూడా అందుబాటులో లేరు. మే 15వ తేదీన ముగ్గురు సభ్యులు గల కమిటీ సభ్యులు ఈ బ్లడ్ బ్యాంక్‌లను పరిశీలించారు. వీరిలో కేం ఆస్పత్రి నిపుణులు కూడా ఉన్నారు. ఈ బృందంతో పాటు ఎఫ్‌డీఏ, సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇన్స్పెక్టర్లు కూడా ఉన్నారు. ఈ బ్లడ్ బ్యాంకులు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అధికారులు లేకుండానే కొనసాగుతున్నాయని గుర్తించారు. ఈ బ్లడ్ బ్యాంక్‌లను కమిటీ పర్యవేక్షించినప్పుడు గోడల నుంచి పేయింటింగ్ తొలగిపోయిందని, రిఫ్రిజిరేటర్ కూడా పాడైపోయిందని, ఏయిర్ కండీషనర్ కూడా పని చేయడం లేదని, బ్లడ్ బ్యాంక్ మొత్తంగా అపరిశుభ్రంగా ఉండడాన్ని ఈ బృందం గమనించింది. సూచన : బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అధికారుల పర్యవేక్షణలో బ్లడ్ సేకరణ, నిల్వ జరగాలని, వీరికి ఎఫ్‌డీఏ అధికారులు ఆమోదం తెలపాలని ఎఫ్‌డీఏ జాయింట్ కమిషనర్ ఎస్.కె.పాటిల్ తెలిపారు. ఇంకా పలు అంశాలను బ్లడ్ బ్యాంక్‌లకు సూచించారు. జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డీన్ డాక్టర్ టి.పి.లహానే మాట్లాడుతూ.. తమ వద్ద ముగ్గురు బీటీవోలు ఉన్నారని, ఇద్దరు సెలవులపై వెళ్లారని తెలిపారు. ఒక్క అధికారి కూడా కుటుంబ సమస్యల వల్ల అందుబాటులోలేరని తెలిపారు. -
ప్లాట్‌ఫాంలు ఇలాగేనా ఉండేది!
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: తాండూరు రైల్వే స్టేషన్లో నెలకొన్న అపరిశుభ్రత, ప్రయాణికులకు కల్పించాల్సిన వసతుల లేమిపై సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ ఎస్.కె. మిశ్రా ఆ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన తాండూరు రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేశారు. ప్లాట్‌ఫాంలపై తిరుగుతూ పలు చోట్ల అపరిశుభ్రతను గుర్తించారు. ప్రయాణికులు కూర్చునేందుకు ప్లాట్‌ఫాంలపై ఏర్పాటుచేసిన ఓ దిమ్మె టైల్స్ పగిలిపోయి ఉండటంపై సంబంధిత అధికారులపై మిశ్రా మండిపడ్డారు. అనంతరం స్టేషన్‌లోని మరుగుదొడ్లను పరిశీలించారు. ప్లాట్‌ఫాంల సమీపంలోని ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. రైల్వేస్టేషన్ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచకపోతే చర్యలు తప్పవని సిబ్బందిని ఆయన హెచ్చరించారు. ప్లాట్‌ఫాం చివరలో ఉన్న పసుపురంగు బోర్డును తొలగించి దాని స్థానంలో రేడియంతో చేసిన బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. పాదచారులే కాకుండా పలు ద్విచక్రవాహనాలు అనుమతి లేని చోట రైలు పట్టాలను దాటుతున్నారని, ఎలాంటి వాహనాలు అటువైపుగా రాకుండా ఇనుప బారికేడ్లు ఏర్పాటుచేయాలన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మిశ్రా మాట్లాడారు. ఫిబ్రవరి 18న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ శ్రీవాస్తవ తాండూరు నుంచి వాడి వరకు సిగ్నలింగ్ వ్యవస్థ, ఇతరత్రా అంశాలపై తనిఖీలు చేయనున్నారన్నారు. దీనిలో భాగంగా తాండూరు రైల్వే స్టేషన్‌కు కూడా వస్తారని చెప్పారు. తాండూరు రైల్వే స్టేషన్ అప్‌గ్రేడేషన్‌లో భాగంగా త్వరలో పలు అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. తాండూరు -సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడవనున్న పుష్పుల్ రైలు ప్రారంభ తేదీని రైల్వే బోర్డు సభ్యులు నిర్ణయించాల్సి ఉందన్నారు. ఇప్పటికే పలుమార్లు ట్రయల్ రన్ జరిపామని, త్వరలోనే పట్టాలెక్కుతుందన్నారు. ఎదురెదురుగా ఒకే పట్టాలపై వచ్చిన రైళ్లు ఢీకొనకుండా కొంతకాలంగా కొనసాగుతున్న టికాస్ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయని ఆయన తెలిపరాఉ. సిగ్నలింగ్ సమస్యతో తాండూరు ప్యాసింజర్ కొద్ది ఆలస్యంతో నడుస్తున్న మాట వాస్తవమేనన్నారు. త్వరలోనే ఆ సమస్యను అధిగమిస్తామన్నారు. డీఆర్ఎంతో అడిషనల్ డీఆర్ఎం సింగయ్య, తాండూరు స్టేషన్ సూపరింటెండెంట్ రవిప్రకాష్ తదితరులున్నారు.