భారత ఆపరేషన్‌కు అంతర్జాతీయ మద్దతు: వెంకయ్య
ఉగ్రవాదులపై భారత సైన్యం చేసిన దాడికి ప్రపంచ దేశాలన్నింటి నుంచి మద్దతు లభిస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. పాకిస్థాన్ ఇప్పటికైనా ఉగ్రవాదులకు సాయం చేయడాన్ని మానుకోవాలని అన్నారు. భారత సైన్యం పాకిస్థాన్ పరిధిలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంలో పాకిస్థాన్ తన బాధ్యతను గుర్తుంచుకోవాలని చెప్పారు. దేశ భద్రతను కాపాడేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి మోదీ చెప్పారని ఆయన తెలిపారు. భారత దేశ ఐక్యత, భద్రత, రక్షణలను కాపాడటంలో తన బాధ్యతను నిర్వర్తించడంలో భాగంగానే ఆర్మీ ఆపరేషన్ చేసిందన్నారు.
భారత భూభాగంలోకి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను భగ్నం చేసే ప్రక్రియలో భాగంగానే భారత సైన్యం ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. పాకిస్థాన్ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతి ఇవ్వకూడదని ఆ దేశాన్ని భారతదేశం పదే పదే కోరుతున్నట్లు చెప్పారు. తాము ఎంత సానుకూలంగా చెబుతున్నా, అటువైపు నుంచి ఉగ్రవాదులకు ప్రోత్సాహం మాత్రమే లభిస్తోందని వెంకయ్య నాయుడు అన్నారు.
I compliment the Indian Army for their surgical operations against terrorist launch pads across the Line of Control. #ModipunishesPak
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 29 September 2016
These ops r a part of d mandate of the Army to prevent infiltration of terrorists into J&K from across the Line of Control. #ModipunishesPak
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 29 September 2016