కొడైకెనాల్(తమిళనాడు): మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల గురువారం ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహానికి దరఖాస్తు చేశారు. కాబోయే భర్త, బ్రిటిష్ జాతీయుడు డెస్మాండ్ కౌటిన్హోతో కలిసి ఆమె హిందూ వివాహ చట్టం–1955 కింద వివాహ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసినట్లు కొడైకెనాల్ సబ్ రిజిస్ట్రార్ మీడియాకు తెలిపారు. హిందూ వివాహ చట్టం ప్రకారం మతాంతర వివాహాలను రిజిస్టర్ చేయలేమని పేర్కొన్నారు. ప్రత్యేక వివాహ చట్టం–1954 ద్వారా వివాహాన్ని రిజిస్టర్ చేయగలమని చెప్పారు. ఇందుకోసం 30 రోజుల నోటీస్ సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
మళ్లీ మణిపూర్ తిరిగి వెళ్లే ఆలోచన లేదని ఇరోం షర్మిల చెప్పారు. సైనిక ప్రత్యేక అధికారాల చట్టంకు వ్యతిరేకంగా 16 ఏళ్లు పోరాటం చేశాను. కానీ ఎన్నికల్లో ప్రజలు నన్ను తిరస్కరించారు. అందుకే మళ్లీ మణిపూర్ వెళ్లాలనుకోవడం లేద’ని ఇరోం షర్మిల వెల్లడించారు. 16 ఏళ్ల నిరాహారదీక్ష చేసిన గతేడాది ఆగస్టు 9న దీక్ష విరమించారు. ఈ ఏడాది జరిగిన మణిపూర్ ఎన్నికల్లో ఆమె పార్టీ తరపున పోటీ చేసిన ముగ్గురు ఓడిపోయారు. ఇరోం షర్మిల కూడా పరాజయం పాలయ్యారు. ఆమెకు కేవలం 90 ఓట్లు మాత్రమే వచ్చాయి.
వివాహానికి ఇరోం షర్మిల దరఖాస్తు
Published Fri, Jul 14 2017 8:44 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM
Advertisement
Advertisement